శ్రీరామచంద్రులవారికి ధూపం అందించాం గదా. ఇప్పుడు చేయవలసిన ఉపచార దీపదర్శనం
దీపం
కం. త్రైలోక్యదీపనుడ వే
యేలాగున తగిన దీప మేర్పడ చూపం
జాలుదు రామా చూపెద
నా లోపలి జ్ఞాన జ్యోతి నళినదళాక్షా
తాత్పర్యం. ఓ కలువ కన్నుల దేవరా శ్రీరామచంద్రా, నీవే మూడులోకాలకూ వెలుగైన వాడివి. నీకు ఏమని నేను దీపం చూప గలను స్వామీ? నా దగ్గర ఒక ప్రశస్తమైన జ్యోతి ఉంది. దానిని జ్ఞానజ్యోతి అంటారు. నాకు తెలిసి అంతకంటే గొప్ప వెలుగు లేదు. దానినే నీకు దీపదర్శనం కోసం అర్పిస్తున్నాను.
(ఆగస్టు 2013)