ముందుమాట: నిన్న రాత్రి మాలిక పత్రిక వారు అంతర్జాలంలో ఒక అష్టావధానం నిర్వహించారు. ఆ అవధానంలో నేను కూడా పాఠకుడిగా పాల్గొన్నాను. ఆ సందర్బంలో పులిహోరకు సంబంధించిన ప్రసక్తి రావటం, అప్పటికప్పుడు నేను పులిహోర ఛందస్సు అనే క్రొత్త వృత్తం ఆవిష్కరించి వ్యాఖ్యల రూపంలో అందరకూ పరిచయం చేయటం జరిగింది. దానిని నా బ్లాగుముఖంగా ప్రకటించటానికి ఈ టపా. అలాగే అంతర్జాల అవధానం గమనించని వారికీ యిది పరిచయం చెయ్యాలని నా ఉద్దేశం.
పులిహోర ఛందస్సు:
లక్షణము: స-న-భ-జ-ర. యతిస్థానం: 9వ అక్షరము.
ఉదాహరణ కొక పాదము: పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో
ఇది తాళగతి గల వృత్తం. ప్రతి పాదంలో మొత్తం 15 అక్షరాలుంటాయి. పాదం సరిగ్గా నాలుగు పంచమాత్రాకాలఖండాలుగా విరుగుతుంది. దశమమాత్రాంతంతో యతి. అనగా 9వ అక్షరం. తెలుగువాళ్ళకు పద్యంలో ప్రవాహగుణం పాటించటం అలవాటు. అంటే పాదాంతంలో పదం పూర్తికాకుండా ఒక్కొక్క సారి తరువాతి పాదం మొదట్లో కూడా కొనసాగుతుందన్న మాట. ఇలా మనం అన్ని వృత్తాలు, జాతి , ఉపజాతి పద్యాల్లోనూ చేస్తూ ఉంటాం. కాని వీలయినంతవరకు తాళగతి ఉన్న వృత్తాదులలో సరయిన చోట్ల విరుపులు వచ్చేలా చూసుకోగలిగితే మరింత శోభాయమానంగా ఉంటుంది. పులిహోరవృత్తం యధావిధిగా యతిప్రాసలు పాటిస్తుంది.
విశేషాలు: మొత్తం పాదంలో ఉండే 15 అక్షరాలలోనూ కేవలం 5 మాత్రమే గురువులు! మూడేసి లఘువుల వరసలు రెండు సార్లు వస్తాయి పాదంలో. ప్రతిగురువుకూ ముందొక లఘువు కూడా తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఛందస్సులో ఒకటి కంటే హెచ్చు గురువులు ప్రక్కప్రక్కన వచ్చేలా వ్రాయటం కుదరదు. ప్రతిపాదంలోను నాలుగేసి పంచమాత్రా గణాలున్నయి - అవి నల-నల-నల-ర. ఇవి ఇంద్రగణాలు కాబట్టి ప్రతిపాదమూ సీసపద్యం శీర్షికాభాగం పాదాల్లోని ప్రధమార్థంగా చూడవచ్చును. అంటే మొత్తం పులిహోరవృత్తాన్ని సీసపద్యంలో గర్భితం చేసెయ్య వచ్చన్నమాట. అందు చేత చిత్రకవిత్వం చెప్పేవాళ్ళకూ పులిహోరవృత్తం నచ్చుతుంది. ఇంకొక సౌలభ్యం యేమిటంటే యతిస్థానం కూడా ఉభయత్రా (పులిహోర, సీసాలకు) సమానంగానే సరిపోతుందికాబట్టి ఆ దిగులూ ఉండదు. తాళప్రధానంగా కుదిరే వృత్తం కాబట్టి అనుప్రాసలు, అంత్యప్రాసలతో చక్కగా క్రీడించ వీలున్న వృత్తం. నా ఉద్దేశంలో ఆశ్వాసాంత పద్యాల్లో వాడటానికి మహబాగా ఉండే వృత్తం ఇది.
మరికొన్ని విశేషాలతో, మరిన్ని ఉదాహరణలతో మరొక టపా వ్రాస్తాను. ఇప్పుడు పులిహోర ఛందస్సు ఆవిర్భావం గురించిన చర్చ వివరాలు చూడండి.
చర్చా విశేషాలు:
అవధానంలో వర్ణన పృచ్ఛకులు శ్రీమతి వలబోజు జ్యోతిగారు పులిహోర ప్రస్తావన చేసారు. దానితోనే మనకు కథారంభం.
జ్యోతి: అదేంటోగాని ఎప్పుడు ఏ పండగొచ్చినా, ఇంట్లో ఏ పూజ చేసినా ముందుగా గుర్తొచ్చేది. చేసే ప్రసాదం పులిహోర. నాకు చిన్నప్పటినుండి ఈ పులిహోరకు, పులికి సంబంధమేంటబ్బా అని సందేహంగా ఉండేది. ఇంకా తీరలేదు.. అవధానిగారు, కాస్త ఈ పులిహోరకు, శార్దూలానికి గల సారూప్యం వివరించగలరా??
అవధాని అనిల్: వృత్తం అడగలేదే మీరు.
ఆ తరువాత వ్యాఖ్యల రూపంలో ఆసక్తి కరమైన చర్చ నడచింది. అదంతా, ఈ క్రొత్త ఛందస్సుకి సంబంధించినంత వరకు యధాతధంగా క్రింద యెత్తి వ్రాస్తున్నాను.
శ్యామలరావు: జ్యోతిగారూ, పులిహోరఛ్చందస్సు అనేది లేదే అని విచారంగా ఉంది. కనిపెట్టాలంటారా?
కామేశ్వరరావు: పులిహోరలో ఉన్న ఛందస్సులో చెప్పమని పృచ్ఛకుల భావమనుకుంటా.
శ్యామలరావు: జ్యోతిగారూ, ఇదిగో పులిహోరఛ్ఛందము: లక్షణము: స-న-భ-జ-ర. యతిస్థానం: 9వ అక్షరము. ఉదాహరణము: పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో
జ్యోతి: వాహ్వా!!.. ధన్యవాదాలండి.. శ్యామలరావుగారు.
లక్కరాజు: శ్యామలరావు గారూ మీ పులిహోర బాగుంది. మూడుసార్లు తినిపించారు.
శ్యామలరావు: మరేనండి. ఒకటి రెండు పట్లకే తృప్తి కలిగదుకదా పులిహోరతో. మీకు ఈ క్రొత్త వృత్తం ఛందస్సు నచ్చిందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.
జె.కె.మోహనరావు: మంచి తాళవృత్తము. క్రింద నా ఉదాహరణ.
అలనాడు నలరాజు – హరుసాన వండెగా
అలనాడు బలభీము – డతి వేగ వండెగా
పులిహోర యన నాల్క – పొడుగాయె జూడగా
పులిహోర పులిహోర – పులిహోర మెక్కిపో
శ్యామలరావు : బ్రహ్మాండం మోహనరావుగారూ. మీకూ నా క్రొత్తవృత్తం నచ్చిందన్న మాట. చాలా చాలా ధన్యవాదాలు.
కామేశ్వేరరావు: భలే! ఈ అవధానం సందర్భంగా చవులూరే ఒక కొత్త ఛందస్సు సృష్టి జరిగడం నాలాంటి పద్య భోజన ప్రియులకు ఎంతో సంతోషకరం! లక్షణమూ, ఆ వెంటనే లక్ష్యమూ కూడా సిద్ధించాయి!
శ్యామలరావు: పులిహోరను రంగంలోకి దించిన జ్యోతిగారికి ముందు నా కృతజ్ఞతలు. లేకుంటే నా యీ ఛందమేవచ్చేది కాదు గదా. అందరికీ నచ్చింనదుకు మరీ ఆనందం. అన్నట్లు యీ వృత్తానికి పులిహోర అన్న పేరే స్థిరం చేయవచ్చును గదా? ఆలోచించండి. మన పద్యాల్లో ఒక ఛందస్సుకు ఆటవెలది అన్న పేరు పెడితే, అది యెబ్బెట్టుగా తోచని మనకి పులిహోర అన్న కమ్మని పేరూ యెందుకు నచ్చకూడదూ అని నా పాయింటు. ఏమంటారు? లక్షణోదాహరణాలు నేనిస్తే మోహనరావుగారు పూర్తిపద్యం చూపారు – వారికి కృతజ్ఞతలు.
జ్యోతి: ఆలస్యమెందుకు. అదే ఖాయం చేసేయండి.. జైహో పులిహోర ..
జె.కె.మోహనరావు: నా దగ్గర ఉండే 1000 కి పైన వృత్తాల పట్టికలో ఈ గణాలు ఉండే వృత్తము లేదు. అందువల్ల ఇది కొత్త ఛందస్సే! సృష్టించిన శ్యామలరావుగారికి జోహారులు.
శ్యామలరావు: మోహనరావుగారు క్రొత్తదే నని నిర్థారణ చేసి చెప్పాక శంఖుతీర్థమే. ధన్యవాదాలందు కోండి మరొక్కసారి మోహనరావుగారూ. రేపు యీ ఛందస్సు ఆవిర్భావం గురించి నా శ్యామలీయం బ్లాగులో వ్రాయా లనుకుంటున్నాను.
శ్యామలరావు: జ్యోతిగారు, అంత సమయం ఉంటుందని నేననుకోను. అయినా యేమాత్రం వీలయినా అవధానిగారికి మన క్రొత్త పులిహోర తినిపించండి. ధన్యవాదాలు.
జ్యోతి: తప్పకుండా. ఈ కార్యక్రమం తర్వాత ఆయన ఇక్కడ చదువుకుంటారు లెండి.. మీ టపా కోసం వెయిటింగ్.. నేను బ్లాగులు ఎక్కువ చూడడం లేదు. అందుకే ఎవరేం రాస్తున్నారో తెలీదు. మీ బ్లాగులో రాసిన తర్వాత కాస్త నాకు చెప్పండి.
వామన్ కుమార్: పులిహోర ఛందం వెరైటీగా ఉన్నది. అవధానం హుషారుగా సాగుతున్నది. అయితే ఈ parallel చర్చ కూడా బహు రమ్యంగా ఉన్నది. ధన్యవాదములు.
ముగింపు: ఇదీ పులిహోర ఛందస్సు కథ. చదువరులు తమతమ అమూల్యాభిప్రాయాలను తప్పకుండా తెలియబరచ వలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
చూడండి అవధానం పేజీ: http://magazine.maalika.org/2013/03/31/అవధాన-పుట