శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి
భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి
నాధేతి నాగశయనేతి జగన్నివాసే
త్యాలాపినం ప్రతిపదం కురుమే ముకుంద
భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి
నాధేతి నాగశయనేతి జగన్నివాసే
త్యాలాపినం ప్రతిపదం కురుమే ముకుంద
భావం:
ఓ శ్రీ కృష్ణా! శ్రీ వల్లభా! వరదా! దయాపరా! భక్తప్రియా! భవబంధాలను త్రెంచి వైచే విద్యలోమహాకోవిదుడా! నాథా! నాగశయనా! జగన్నివాసా! ఎల్లప్పుడూ నీ నామాలను ఆలపిస్తూ ఉండేటట్లుగా నన్ను చేయి స్వామీ!
స్వేఛ్ఛానువాదం:
సీ. శ్రీవల్లభాయని చింతించ నీయవే
వరదాయకా యని పాడనీవె
పరమదయాళుడ వని పొంగనీయవే
అఖిలేశ శ్రీహరీ యనగనీవె
భక్తప్రియాయని భావించ నీయవే
భవవిమోచనా యని పలుకనీవె
శేషశయన యని చింతించ నీయవే
నోరార ఫ్రభు యని నుడువనీవె
తే.గీ. అని జగన్నివాస స్వామి యమిత భక్తి
ప్రతి దినంబును భావించు పరమదివ్య
భాగ్య గరిమను నాకీయ వయ్య దేవ
కొలుచుకోనిమ్ము నన్ను ముకుంద నిన్ను
భాగ్య గరిమను నాకీయ వయ్య దేవ
కొలుచుకోనిమ్ము నన్ను ముకుంద నిన్ను