విడువక నాతో నిలచితివి నే పాడినవి విని మెచ్చితివి నా కేడుగడవు నీ కేమిత్తునయా నీ వేడుక తీరగ పాడుట గాక |
|
తడవకు తప్పులు వెదికే జగమును విడిచి నీ మరువును సొచ్చితిని గడబిడ పడు నా మనసున నీవే వడివడి శాంతము నింపితివి |
|
గడచిన బ్రతుకుల కలిగిన స్నేహము విడువని నిన్నేమని పొగడుదును నడువనిమ్ము నీ యడుగుల నడుగిడి ఇడిముడియా ఈ నీ నా ప్రేముడి |
|
బడుగు వీ డని తలపవు రామా కుడిపెద వోహో కరుణామృతము కడలి కంటె గంభీరము నీ హృది బడలనీక నను పాలించెదవు |
|
16, జులై 2015, గురువారం
విడువక నాతో నిలచితివి నే పాడినవి విని మెచ్చితివి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)