కొందరు లేడనగానే కీర్తికి కొంచెము కాని రాముడు
సత్యసంధుడీ రాముడు బహు సరసహృదయుడీ రాముడు
నిత్యము భక్తుల కోర్కెలు తీర్చే నిరుపమానుడీ రాముడు
నాకు నీవే రక్షకుడవని నమ్మితిని శ్రీరామచంద్రా
నీకు మ్రొక్కుదు గాని యేమియు నేను కోరను రామచంద్రా
తల్లి వీవే తండ్రి వీవే దశరథాత్మజ రామచంద్రా
యెల్లవేళల నాకు వలసిన దిచ్ఛుచుండే రామచంద్రా
వెల్లువై కష్టములు నన్నిట విరుచునప్పుడు రామచంద్రా
చల్లగా నాకెపుడు చేతిని జాచువాడవు రామచంద్రా
భువనమందున నీకు బిడ్డలు పోల జీవులు రామచంద్రా
ఎవరి కేనా డేది యీవలె నెరుగుదువుగా రామచంద్రా
శివుడు తారకమంత్ర మిచ్చుచు చెప్పెనిది శ్రీరామచంద్రా
అవిరళమ్ముగ నిన్ను కొలిచెద నంతియే హరి రామచంద్రా
శ్రీరామనామము ప్రాణమైన జీవితమ్మే చాలదా
ఆరాముడే నీప్రాణసఖుడై నట్టి బ్రతుకే చాలదా
హరి దివ్యగాథాలహరి వినెడు నట్టి చెవులే చాలవా
హరి నామమొకటే పలికి మురిసెడు నట్టి నాలుక చాలదా
హరి పూజలందే నిత్యముండెడు నట్టి కరములు చాలవా
హరి క్షేత్రములనే తిరుగుచుండెడు నట్టి కాళ్ళే చాలవా
హరి రూపములనే చూడగోరెడు నట్టి కన్నులు చాలవా
హరితత్త్వచింతన మందు నిలిచెడు నట్టి బుధ్ధియె చాలదా
హరిభావనారతి ననిశముండెడు నట్టిమనసే చాలదా
హరి కరుణకన్యము నాకు వలదను నిశ్చయంబే చాలదా
హరిభక్తులే నీకాప్తబంధువు లైన నదియే చాలదా
హరి కన్యదైవము లేడులేడను నట్టి ధృఢతయె చాలదా
హరి విశ్వకర్తయు విశ్వమయుడను నట్టి యెరుకే చాలదా
హరి మోక్షమిచ్చును వేరు వరముల నడుగ ననుటే చాలదా
కల్యాణి
ఇచ్చట రాముని పాటల ముచ్చటలే దొరకు నండి
వచ్చి స్వయముగా నరసి మెచ్చి మీరు పాడుకోండి
నిండు మనసుతో రాముని నిత్యము సేవింతురా
పండుగయే రామునిపై పాటలనే పాడుకొనుట
రండి సుజనులార మీరు రామునిపై కీర్తనలు
దండిగా లభించు నిచట తప్పక విచ్చేయండి
పదేపదే రామాయని పలుకుచును మురియుచును
సదా హృదయముల రామసన్నిధియే కలవారికి
ముదావహముగా నిచట నే ప్రొద్దనకను భక్తి మీర
సదారామభజన జరుగు సంతోషముగ రండి
హరినామ స్మరణమందె నిరంతరము గడుపువారు
తరింతురు మరల వారు ధరకు వచ్చు పనే లేదు
హరినామము మారు మ్రోగు నట్టి మంచిచోటి దండి
పరుగున శ్రీరామభక్తవరు లారా రండి రండి
1. Notes
S R G M P D Nn
oare the basic symbols for the notes.
2. Note positions.
Notes other than S and P can have multiple positions denoted by numerals
1 2 3
They are usually written in two forms
Like R1 R2 R3
Or as R1 R2 R3
3. Repetition of a note
A Note symbol may be prefixed by an integer to signal the number of times it should be repeated
Example 10R2
3. Sequence of notes.
A sequence of notes can be specified with optional white space embedded.
A sequence of notes may be optionally specified within parenthesis.
Example S G M P N
or ( S G M P N )
or (4S 9G 2M 3P 3N)
4. Repeating sequence.
A sequence can be repeated as many times.
Like 4( 4S 9G 2M 3P 3N)
5. Combining sequences
Sequences written together form a single sequence
Like 2(S G) 4(M D)
which can have repetition like 5( 2(S G) 4(M D) )
6. Holding notes
A single note may be held for a longer time written like
4.S
This is difference from repetition.
4S
Holding applies to a single note only. Does not apply to a sequence.
7 Tala Symbols.
దిక్కంటే అందరకూ దిక్కు రాముడే
దిక్కంటే అన్నిటీకీ దిక్కు రాముడే
సర్వలోకములకు రామచంద్రు డొకడె దిక్కు
సర్వకాలములను రామచంద్రు డొకడె దిక్కు
సర్వజీవులకును రామచంద్రు డొకడె దిక్కు
సర్వవిధములుగను రామచంద్రు డొకడె దిక్కు
సర్వదిక్కులందు రామచంద్రు డొకడె దిక్కు
సర్వకష్టములను రామచంద్రు డొకడె దిక్కు
సర్వవ్యాధులందు రామచంద్రు డొకడె దిక్కు
సర్వులును తరింప రామచంద్రు డొకడె దిక్కు
పద్యనిర్మాణం చాలా విధాలుగా శుధ్ధంగా ఉండాలి. ఇవి స్థూలంగా ఎనిమిది విధాలుగా మనం గమనించవచ్చును.
1. ఛందశ్శుధ్ధి
2. భాషాశుధ్ధి
3. వ్యాకరణశుధ్ది
4. విషయశుధ్ధి
5. సందర్భశుధ్ధి
6. భావశుధ్ధి
7. ధారాశుధ్ధి
8. అన్వయశుధ్ధి
వీటి గురించి వచ్చే వ్యాసాలలో చర్చించుకుందాం.
ఒక విషయ మాత్రం ముందే చెప్పుకోక తప్పదు, పద్యం సరిగా వ్రాయాలీ అనుకొనే ఆసక్తీ శ్రధ్ధా ఉన్నవారికి మాత్రమే ఈవ్యాసాలు కాని మంచిపద్యం తీరు అంటూ వ్రాస్తున్న పద్యాలు కాని ఉపయోగిస్తాయి.
మాకంతా తెలుసును, మేమేమైనా బాలురమా అని కోపగించుకొనే వారికీ, పద్యం ఎలా వ్రాస్తే నేమి అని ఉదాసీనంగా ఉండేవారికీ, నాపట్ల వ్యక్తిగత వైమనస్యంతో నేను చెప్పటమే తప్పని భావించేవారికీ, ఇలాంటి వారు అనేకులకు ఈవ్యాసాలూ నాపద్యాలూ ఏమీ నచ్చవు, ఉపయోగించవు. అది నాతప్పు కాదు. దానికి నేనేమీ చేయలేను.
నిజానికి ఆట్టే వ్రాయగల స్థితిలో లేను. లోకహితంగా ఏదో కొంచెం వ్రాయాలన్న తాపత్రయంతో వ్రాస్తున్నాను. నా మనస్సుకు కొంచెం ప్రక్కకు మళ్ళించి ఈ సద్విషయాలను ముచ్చటించుకోవటం ద్వారా ఉపశాంతి పొందుదామన్న ఆశతో వ్రాస్తున్నాను శరీరం మరీ సహకరించకపోయినా.
కాని ప్రతివిషయంలోనూ రాధ్ధాంతం చేసే వారూ, ఎక్కడెక్కడికో పోయి నాపేరెత్తి అవాచ్యాలు వ్రాసే వారూ అక్షరాలా నిరుత్సాహం కలిగిస్తున్నారు.
దయచేసి ఆసక్తి కలవారు చదవండి. లేని వారు దూరంగా ఉండండి. సంతోషం.
నందగోపసుతావంద్య బృందారకజనవంద్య
నందివాహనా త్రిపురసుందరీశ మునివంద్య
వందనమో శివశంకర ఫాలవిలోచన హర
వందారు భక్తసుజనమందార దురితహర
సుందరాకార ఉమాసుందరీ సహిత లోక
వందిత సంసారభయాపహర భవతాప హర
వందనమో సదారామవందితచరణారవింద
వందనమో రామనామపారాయణసదానంద
వందనమో మహాదేవ వరదాయక శుభదాయక
అందె నాకు భవతారక మద్భుతముగ నీదయచే
అరవైయేళ్ళ క్రిందటి సంగతి.
హైస్కూలు చదువురోజులు. కొత్తగా పద్యవిద్య మురిపెం ఒకటి తగులుకుంది.
మాగురువుగారు వేదుల వేంకటరావు గారు ఒక పద్యపాదం బోర్డు మీద వ్రాసి పూర్తిచేయండ్రా ఆన్నారు. నాపూరణ నచ్చింది వారికి. నేర్పటం మొదలు పెట్టారు. నాతోపాటు మరొక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు కాని వారు ఎక్కువదూరం రాలేదు.
కొత్తపేటలోని ధనమ్మమర్రి దగ్గర పిక్నిక్ ప్రోగ్రాంలో మాకన్నబాబు అడిగితే ఆశువుగా చెప్పిన రెండు పద్యాల్లో ఒకటి.
తొలిజాము కోడికూసెను
తెలవారగ నుండె ననుచు తెలుపుట కొరకై
కల నిష్టభోగతతులన్
కులుకుచు నున్నట్టి భిక్షుకుడు కోపించెన్
రెండవది గుర్తులేదు.
మాస్నేహితుడు పాండురంగారావు పెళ్ళిలో చెప్పిన కొంటె పద్యం ఒకటి
నాగేశ్వర ప్రియభక్తా
అని మొదలౌతుంది. ఆముక్క ఒకటే గుర్తుంది మొత్తం రెండు పద్యాలకూ.
విషయం ఏమిటంటే మాపాండురంగారావు అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని.
కాలేజీరోజుల్లో ఒక వ్యాసరచన పోటీలో నేను కొటేషన్లు పద్యాల రూపంలో వ్రాసాను. ఆశుకవిత్వం కాదు కానీ ఇంచుమించు అలాంటిదే. ఆదెబ్ఫకు మొదటి బహుమతి ఖాయంగా ఒళ్ళోపడుతుందని నమ్మాను. అన్నాను. వచ్చింది.
ఆపద్యాలేవీ గుర్తులేవు.
ఒకపద్యం మాత్రం
బస్సుల్ తగులం బెట్టిరి
అని ప్రారంభం అవుతుంది. ఇంక ఏమీ గుర్తులేవు.
కాంభోజి
నీయందు మాబుధ్ధి నిలచి యుండు నటుల
జేయుమా సర్వేశ శ్రీరామచంద్ర
మాయచే కాయముల మతిమాలి ప్రేమించి
నీయందు బుధ్ధినే నిలుపగ లేము
మాయదారి మాయ నీయునికినే గప్పి
వేయగా నిన్నెరుగు విధమేది దేవుడా
మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి
మాయలోనే చచ్చు మాబోంట్లకు
మాయ యొక టున్న దను మాట తెలియుట యెట్లు
తోయంబులకు వెలి తోచునా చేపలకు
ధ్యేయుండ వగు నిన్ను తెలియనీయదు మాయ
మాయింద్రియము లందు మసలుట చేత
నీయాన గొని యాడు నీమాయ తొలగితే
ఓయయ్య నిను విడచి యుండునా మాబుధ్ధి
పద్యవిద్య బాగా అబ్బాలీ అంటే సహజసిధ్ధమైన ప్రతిభ కొంత ఉండాలీ అన్న నామతాన్ని విపులంగా చెప్పటానికి ప్రయత్నించాను. ఇటువంటి జన్మసిధ్ధప్రతిభాపరత అన్నది ఏలలితకళ విషయంలోనైనా సరే వర్తిస్తుంది అన్నదీ వివరించాను.
ఇపుడు మరొక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను.
కవిత్వం చెప్పటానికి పాండిత్యం ఎంత అవసరం అన్న చర్చ ఒకటి ఉంది.
నిజానికి చాలా మంది పండితులకు పద్యవిద్య రాదు.
అలాగే చాలా మంది కవులు చెప్పుకోదగ్గ పండితులు కారు.
ఐతే కావ్యనిర్మాణం వంటివి చేయాలంటే తగుమాత్రం పాండిత్యం అవసరం. అలాగని మహాపండితులు కావాలా అంటే అది వేరే చర్చ.
పూర్వం భట్రాజులని ఉండేవారు. రాజులను జమీందారులను పద్యవిద్యతో తెగ పొగిడి పొట్టపోసుకోవటం వారి వృత్తి. ఇప్పుడు రాజులూ జమీందారులూ లేరు. అందుచేత భట్రాజులూ కనబడటం లేదు.
భట్రాజులలో పద్యవిద్య ఒక కుటుంబవిద్యగా ఉండేది.
వాళ్ళు సాదారణంగా చిన్నా పెద్దా పద్యాలను ముక్తకాలుగా ఆశువుగా చెప్పగలరు కాని కావ్యనిర్మాణం చేసే స్థాయి విద్యా విద్వత్తూ వారికి ఉండేవి కావు.
ఇలాంటి భట్రాజు గారు ఒకాయన నాకు కొత్తపేటలోని లైబ్రరీలో కలిసారు. నలుగురికీ విద్యాప్రదర్శన చేస్తే కాసిని డబ్బులు వస్తాయి కదా అన్న ఆశతో ఆలైబ్రరీకి వచ్చాడాయన. చిన్నపాటి గోష్ఠి జరిగింది. నేను కొన్ని తెలిసిన సమస్యలను ఇస్తే ఆశువుగా వేగంగా పూరించి అబ్బురపరిచారు. ఆసమస్యలు మామావయ్య గారికి అష్టావధానాలలో ఇవ్వబడిన సమస్యలు. ఈభట్రాజు దగ్గర తగుపాండిత్యం కూడా ఉందన్నమాట. అందరూ కలిసి ఐదో పదో ఇచ్చిపంపారు. పెద్దపాండిత్యం లేకపోయినా పద్యం చెప్పగలిగారీ భట్రాజు గారు.
నేను చూసిన మరొక నికార్సైన ఆశుకవి మాగురువుగారు కీ.శే. వేదుల వేంకటరావు గారు. నా ఉపనయన సందర్భంలో సాటి ఉపాధ్యాయులు ఆయనను మాష్టారూ మీశిష్యుడిని ఆశీర్వదిస్తూ పద్యాలు చెప్పరా అంటే వెంటనే దడదడా ఒక పాతిక ముఫ్ఫైపద్యాలను ఆశువుగా చదివారు. ఆయన గొప్పపండితకవి. మా ఊళ్ళో భువనవిజయం చేసినపుడు వేదులవారు అల్లసాని పెద్దనగా ఉండేవారు.
మాపాఠశాలలోనే వెంపరాల శివబ్రహ్మ శాస్త్రి గారు పండితులే కాని కవి కాదు. పాఠశాలవార్షికోత్సవం సందర్భంగా ఆయన పద్యాలు వ్రాసి ఒరే సరిచూసి యివ్వరా అన్నారు. ఏమిటి సరిచూసేది? అవన్నీ నేను తిరుగవ్రాసి యివ్వవలసి వచ్చింది. వేదులవారి చేత తిట్లు తినవలసి వచ్చింది ఘోష్ట్ రైటింగ్ చేసినందుకూ ఒక నరమానవుడి మీద స్తుతి పద్యాలు వ్రాసినందుకూ.
నేను ఆశుకవిత్వం చెప్పిన సందర్భాలు ఒకటి రెండే అప్పుడైనా చెప్పినవి రెండేసి పద్యాలే. అవైనా కందాలే అని గుర్తు. అప్పట్లో కందం చెప్పినవాడే కవి ఒక అపోహ వ్యాప్తిలో ఉండేది లెండి. ఆశుకవిత మీద నాకు మోజు లేక నేను ఆదిశగా ఏమీ కృషి చేయలేదు.
చెప్పవచ్చేది ఏమిటంటే పాండిత్యం కవికి మంచి ఉపకరణం కాగలదు కాని అది స్వయంగా కవిని చేయలేదు. అలాగే చెప్పుకోదగిన పాండిత్యం లేకపోయినా కవిత్వం చెప్పవచ్చును.
కవిత్వకళ సహజంగా ఉండినపక్షంలో పాండిత్యం దానికి మంచి అలంకారం అవుతుంది.
నిజానికి ఏఉపకరణం ఐనా కవికి సహాయం చేయగలదే కాని కవిని తయారుచేయలేదు. అలా సాధ్యంకాదు. అలాంటి అపోహ ఉంటే ఔత్సాహికకవులు దాని నుండి ఎంత తొందరగా బయటపడితే వారికి అంత మేలు కలుగుతుంది.
ఏలలితకళకు ఐనా సహజసిద్దం ఐన ప్రతిభ కొంత ఉండితీరాలి అన్నాను. ఆముక్క మీద చర్చించుకోవలసినది మరికొంత ఉంది.
సహజసిధ్ధం అంటే పుట్టుకతో వచ్చినది అని అర్ధం. దానినే దైవదత్తంగా వచ్చిందనీ అంటూ ఉంటాం.
ఇక్కడ దైవం అంటే భగవంతుడు అన్న అర్ధం కాదు. దైవం అంటే మనిషికి పురాకృతమే. ఏజన్మము ఐనా అది అంతము ముందు నడచిన జన్మపరంపరకు కొనసాగింపుగానే తెలుసుకోవాలి.
పూర్వజన్మ కర్మములయందు మన జీవునకు అంటిన వాసనాబలం ప్రస్తుతజన్మకు సహజమై వస్తుంది. ఒకడు యోగసాధకుడుగా ఉంటాడు. జన్మాంతం ఐనది. మరుజన్మకు తన సాధనాబలం తీసుకొని వస్తాడు. తగిన సమయసందర్భాలు ఏర్పడగానే మరల యోగసాధనను అవలంబిస్తాడు. ఈవిషయం భగవద్గీతాంతర్గతంగా ఉన్నదే కాని నేను చెప్పే మాట కాదు.
మంగళంపల్లి వారు తన ఏడవయేటనే సంగీతకచేరీ చేసారు. సూర్యగాయత్రి గొంతులో లయను తల్లి మూడవయేటనే గుర్తించింది - ఆమె యిప్పుడు ప్రముఖగాయని - పదేళ్ళక్రిందటినుండే మంచి గాయనిగా గుర్తింపుపొందింది. కన్నడ ఛానెల్ వి మ్యూజిక్ టేల్స్ వీడియోల్లో కనిపించే ఆత్రేయ సిస్టర్స్ సంగతీ అటువంటిదే. చిన్నవయస్సులోనే అష్టావధానాలు చేస్తున్న వాళ్ళను చూస్తున్నాం. మావాళ్ళల్లో కొందరు చిన్నపిల్లలు అద్భుతంగా బొమ్మలు వేస్తున్నారు.
ఇటువంటి వారి వెనుక జన్మపరంపరాగతమైన వాసనాబలం ఉందని చెప్పకతప్పదు.
పుట్టుకతో కవిత్వం వ్రాసే ప్రజ్ఞ రాకపోతే నేర్వకూడదా అంటే తప్పక నేర్వవచ్చును. అది కూడా సంభవమే. కవిత్వం అయేది మరొకటి అయేది పట్టుబట్టి నేర్చుకుంటే అలవడ కూడని విద్య యేమీ కాదు. కాని అందుకు ఎంతో దీక్ష అవసరం. మంచి శిక్షణ అవసరం. సులభమార్గాలూ ఉపాయాలూ అంటూ అడ్డదారుల ప్రలోభాలను జయించటం ముఖ్యం. మంచి గురువు ముఖ్యం. గొప్ప సాధన ముఖ్యం.
సహజంగా పుట్టువుతో ఒక కళ మీద ప్రజ్ఞ రాకపోయినా ఇలా కొందరు రాటుదేరతారు. పట్నం సుబ్రహ్మణ్యం అయ్యరు గారి కంఠం పాటకు అనువు కాదని గురువులు తిరస్కరిస్తే ఆయన వారిని మెప్పించటానికి కఠోరమైన సాధన చేసారు. ఎంత మంచి కంఠాన్ని సాధించి ఎంత గొప్ప గాయకులు అయ్యారో అందరికీ తెలుసు.
కొందరకు ఎంత సాధన చేసినా కొన్ని కళలు పట్టుబడక పోవచ్చు. భగవంతుడు మరొక దారి చూపుతాడు.
ఏదైనా కళ మీద అభిమానం కల్గటం మంచిదే. అకళను అభ్యాసం చేయాలనుకోవటం మంచిదే. కాని ఎంత సాధనచేసినా పట్టుబడనప్పుడు వదిలిపెట్టటం కూడా మంచిదే.
సాధన అన్నది ఎంత చిత్తశుధ్ధిగా చేసాము అన్నది ముఖ్యం. ఎంత తీవ్రంగా చేసాము అన్నది ముఖ్యం.
సాధనాక్రమంలో ఏర్పడే దురదను నిగ్రహించుకోవటం మరీ ముఖ్యం.
కవిత్వం విషయం లోనికి వస్తే ఒక పద్యం వ్రాస్తే ఈ రోజుల్లో దాన్ని ప్రచురించి జనం మీదకు వదలటం మహాసులువు. అభ్యాసం కోసం వ్రాస్తున్న ప్రతి పద్యం ప్రచురణ చేస్తే ఎలా?
విశ్వనాథ వారిని ఎవరో అడిగారు. మీరు ఇంతవరకూ ఎన్ని పద్యాలు వ్రాసి ఉంటారు అని. నేను వ్రాసి చించివేసిన పద్యాలే ఒక ముఫ్ఫైవేల కంటే ఎక్కువే ఉంటాయి అన్నారు. అంటే ఏమన్న మాట? అంత కఠోరసాధన చేసారు అని. తనదైన శైలి ఒకటి ఏర్పడే దాకా, తన ధారశుధ్ధి వగైరాలు సంతృప్తికరంగా అనిపించేదాకా ఆయన తన పద్యాలను జనం ముందుకు తేలేదు.
ఇప్పుడు? ఔత్సాహికులు పద్యం వ్రాయటం ఆలస్యం అది బాగా వచ్చిందా లేదా అన్న పట్టింపు లేకుండా జనం మీదకు విసురుతున్నారు.
ఒక పద్యం బాగా వచ్చిందా అని మొదట్లో మనకు ఎలా తెలుస్తుంది?
ఎవరైనా గురువులను ఆశ్రయించాలి.
మొకానికల్ టూల్స్ గురువులు కాలేవు.
మీరు పద్యం వ్రాయటానికే ఒక టూల్ వాడుతూ, ఆ టూల్ కాస్తా పద్యం పూర్తయింది అనగానే మంచిపద్యం వచ్చేసింది అని భ్రమపడటం అక్షరాలా అజ్ఞానం.
ఒకరు కాకపోతే నలుగురు పెద్దలసాయంతో తప్పులు దిద్దుకుంటూ పరిశ్రమ చేస్తే క్రమంగా పద్యం వ్రాయటం పైన పట్టుసాధించవచ్చును. కొందరికి ఏడాది పట్టవచ్చు. కొందరికి ఏడేళ్ళు పట్టవచ్చు. కొందరికి వల్లకాకపోవచ్చును కూడా.
పద్యం వ్రాయటం గురించి మాట్లాడుకుంటున్నాం.
ఈ వ్యాసం రెండవది.
నా టీనేజ్ చివరి నుండి కొన్నేళ్ళు నేను రంపచోడవరం గ్రామంలో ఉన్నాను. మానాన్నగారు ఉపాధ్యాయులు. ఆఊరికి బదిలీమీద వెళ్ళారు ప్రధానోపాధ్యాయులుగా. కాబట్టి పదేళ్ళు చిల్లరగా కొత్తపేటలో ఉన్న మాకుటుంబం అంతా రంపచోడవరానికి నివాసం మార్చటం జరిగింది.
ఆఊళ్ళో సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులుగా శ్రీ రావాడ కృష్ణ గారు వచ్చారు. వచ్చారు అనటం ఎందుకంటే ఆ పాఠశాలలో మొత్తం స్టాఫ్ అందరినీ బదిలీలు చేసి ప్రధానోపాధ్యాయుల నుండి అందరినీ కొత్తవారిని వేసారు. అతికొద్ది మంది మాత్రమే పాతవారు. అలా వచ్చిన వారిలో కృష్ణ గారు ఒకరు. ఆయన మంచి చిత్రకారులు.
ఆయనతో నాకు మంచి స్నేహం ఏర్పడింది. కృష్ణ గారు తీరిక దొరికినప్పుడల్లా బొమ్మలు వేస్తూ ఉండేవారు. అవి చూసి ఒకసారి నేను మాష్టారూ బొమ్మలు బాగున్నాయి కదా పత్రికలకు పంపవచ్చు కదా అన్నాను. ఆయన నవ్వి నాబొమ్మలను పత్రికల వాళ్ళు పదేళ్ళకు పైగా పోషించారు. ఇంకా పంపటం బాగుండదులే కొత్త వాళ్ళు రావాలి కదా అన్నారు.
అలా ఒకసారి ఆయన బొమ్మలు వేస్తుంటే అక్కడికి సి ఐ గారి అమ్మాయి వచ్చింది. ఆమె నాదగ్గర ట్యూషన్ చెప్పించుకుంటూ ఉండేది.
కృష్ణ గారిని నాబొమ్మ వేసివ్వరా అని బ్రతిమాలింది. ఆమె నోట్ బుక్ తీసుకొని ఒకటి రెండు నిముషాల్లో అట్టా అట్టా గీసి యిచ్చారు. ఆవేగాన్ని చూసి ఆశ్చర్యం. ఆబొమ్మను చూసి మహదాశ్చర్యం. అంత చక్కగా ఉంది. నాకూ చిత్రకళ మీద అసక్తి ఉందీ అని గ్రహించి నా విద్యకు మెరుగులు దిద్దుదాం అనుకున్నారు కాని కృష్ణ గారు త్వరగానే నాలో సహజంగా చిత్రకళావిలాసం పూజ్యం అని గ్రహించారు.
ఏలలితకళకు ఐనా సహజసిద్దం ఐన ప్రతిభ కొంత ఉండితీరాలి. అపైన గురుకృప. ఆపైన అభ్యాసం
లలితకళలనే కాదు చాలా విద్యల విషయంలో కూడా ఇది నిజమే.
ఒకాయనకు కొడుకుని డాక్టరును చేయాలని ఉంది. బోలెడు డబ్బు ఉంది కాబట్టి ఫీజు కట్టి చదివించగలడు. అది కోట్ల మీద ఉన్నా సరే. ఆ కొడుకు కూడా విద్య యొకడి బాబు సొత్తా యేమి, నేను డాక్టరును కావాల్సిందే అనుకున్నాడు.
లక్షలు ఖర్చు చేసి కోచింగ్ ఇప్పించాడు. కాని వాడికి ఆ దిక్కుమాలిన సెట్ పరీక్షల్లో తగినంత స్థాయి రాక పోయింది. ఏమన్న మాట? మనకు కోరిక ఉంటే సరిపోతుందా? తగిన ప్రతిభ ఉండాలి. చెప్పాను కదా, అది కొంత దైవికం. ఆపైన మానవప్రయత్నం గురువుసాయమూ అభ్యాసమూ అని.
టూల్స్ ముందు వేసుకొని యూట్యూబ్ సాయంతో కుర్చీని తయారు చేయవచ్చును అభ్యంతరం లేదు. కాని సరైన కుర్చీని తయారు చేయగల వడ్రంగం నైపుణ్యం కొంతైనా సహజంగా ఉండి ఉంటేనే పనిజరుగుతుంది. లేని పక్షంలో వందల గంటల కష్టం చేసినా సంతృప్తికరమైన పనివాడితనం రాకపోవచ్చును.
ముందు దైవదత్తం ఐన గాత్రం ఉంటేనే సంగీతం నేర్చుకొని గాయకుడు అయ్యేది.
ఏవిద్యనూ ' అంట ' వల దని ఎవరూ చెప్పరు. అది మనకు అంటుతుందో లేదో మీకు మీరు కొంత అవగాహన కలిగి ముందుకు వెళ్ళాలి. మన అవగాహన సరైనది అని గురువులు అనుకుంటే రాణించేందుకు దారులు పడతాయి. ఆపైన మన అభ్యాసదీక్ష మీద ఆధారపడి ఉంటుంది ఎంతగా విద్య అబ్బేదీ అన్నది.
ఛందం అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్ మాత్రమే దానికి ఉన్న ప్రయోజనం దానికి ఉంది. అది అనువుగా ఉందని చెప్పి దాని సహాయంతో అడ్డదారిన పద్యాలను తయారు చేయటం వలన ఆట్టే ప్రయోజనం ఉండదు. ప్రత్యేకించి ఈమాట చెప్పటం ఎందుకంటే అలా ప్రయత్నం చేస్తూ పద్యాలను పోలిన వికారాకృతులను కొందరు అమాయకంగా అచ్చులు పోసి తీసి జనం మీదికి వదులుతో ఉండటం దినదినమూ చూస్తునే ఉన్నాం కాబట్టి. ఈచర్చ అంతా పద్య విద్య గురించి కాబట్టి.
మరికొన్ని విషయాలు తరువాయి వ్యాసంలో ముచ్చటించుకుందాం. ఇప్పటికే పెద్దదైనట్లుంది.
కొన్నేళ్ళ క్రిందట ఛందం అని ఒక వెబ్ సైట్ వచ్చింది.
అక్కడ మీరు ఒక పద్యాన్ని కాపీ & పేష్ట్ చేసి అది ఏ ఛందస్సులో ఉన్న పద్యమో అన్నది సులభంగా తెలుసుకోవచ్చును.
అలాగే మీరే స్వయంగా ఒక పద్యాన్ని టైపు చేయటానికి ప్రయత్నం చేయవచ్చును. మీరు వ్రాసినది ఏఛందస్సులో ఇముడుతున్నదీ మీకు సులభంగా తెలుస్తుంది. మీరు తప్పులు చేస్తుంటే, ఫలాని ఛందస్సులా ఉండేలా ఉంది కాని ఇక్కడ-ఇక్కడ ఈ-ఈ తప్పులున్నాయీ అని కూడా చెబుతుంది.
ఇదిగో నండీ, ఇలాగ పద్యాన్ని ఛందం పేజీ సాయంతో నేరుగా టైపు చేసుకోవచ్చునూ అదిన్నూ తప్పులు దిద్దుకుంటూ అన్నది కొందరికి బాగా నచ్చింది..
కొందరు వీరపద్యబొమ్మన్ అవతారం ఎత్తి పద్యాలు కుట్టటం మొదలు పెట్టారు.
కానీ సరిగా పద్యం వ్రాయటం మరీ అంత తేలిక వ్యవహారం కాదు.
కేవలం ఉత్సాహం ఒకటే సరిపోతుంది కదా అనుకోవటం సరి కాదు.
నాకు బొమ్మలు వేయటం ఒక సరదా. చిన్నతనంలో కొన్ని వేసాను. వాటిలో కొన్ని బాగానే వచ్చాయి కూడా. మా యింట్లో నెహ్రూ గారి ఫోటో ఒకటి ఉండేది చక్కటి ఫ్రేం కట్టినది. దానికి బోలెడన్ని నకళ్ళు గీసాను. కొన్ని సార్లు సీవీ రామన్ బొమ్మలు వేసాను. కొన్ని ప్రకృతిచిత్రాలు వేసాను. బాగానే వేస్తున్నానని అనుకోలేదు ఎప్పుడూ. ఎందుకంటే సహవిద్యార్ధుల్లో మంచి చిత్రకారులే ఉండేవారు..
చిత్రకళ అయ్యేది కవిత్వం అయ్యేది మరొక లలితకళ అయ్యేది మొదట జన్మతః కొంతగా రావాలి. ఆపైన కొంత సాధన. తరువాత గురుముఖతః మెళకువలు నేర్చుకోని విద్యను సానబెట్టుకోవాలి. గురువులు చెప్పిన సాధనలు బాగా చేయాలి. అలా ప్రావీణ్యం వస్తుంది.
ఛందోబధ్ధమైన కవిత్వం కూడా అంతే. నేనైతే ఏడవ తరగతిలో ఉండగా కొన్ని పద్యాలు వ్రాసాను. మానాన్నగారి కంటబడ్డాయి. ప్రోత్సహించారు. నిజానికి నాకు అప్పడు ఛందస్సు గురించి ఏమీ తెలియదు. అవగాహన దేవు డెరుగు.
అదృష్టవశాత్తూ హైస్కూలు రోజుల్లో తెలుగుమాష్టారు ఆశుకవి వరేణ్యులు కీ.శే. వేదుల వేంకటరావు గారి ప్రోత్సాహం లభించింది. కొంతగా ఆయన సానబట్టారు నా శక్తిని.
ఇప్పుడు ఛందం పుణ్యమా అని కొందరు అక్షరాలను పేర్చటం లేదా వాటిని కావలసిన గణాల్లో కుక్కి సరిపెట్టటం చేసినంత మాత్రాన పద్యం ఐపోతుందన్న భ్రమలో ఉన్నారు.
ఈ భ్రమ యితరత్రా కూడా కనిపిస్తోంది.
ఈమద్య పద్యవిద్యను నేర్పేసే గురువులు లావయ్యారు, బేచ్ తరువాత బేచ్ లెక్కన కవులను తయారు చేసి వదులుతున్నారు. అలా తయారవుతున్న వారిలో కొందరు ఏకంగా శతకాలు చెక్కి పారేస్తున్నారు.
కాని మంచి పద్యాలు మాత్రం ఆట్టే రావటంలేదు.
అసలు మంచి పద్యం వెనుక ఉండే మంచి లక్షణాలు ఏమిటీ అన్న వివేచనే ఈ ఫాక్టరీ మేడ్ అండ్ ఛందం మేడ్ కవులకు ఉండటం లేదు. అసలు ఆదృష్టిలో ఆలోచనే వారికి ఉండటం లేదు.
మరొక రెండు మూడు టపాల ద్వారా ఈ విషయాన్ని వివరించటానికి ప్రయత్నం చేస్తాను.
వేవేల నామాల వెన్నుడ నీమహిమ
భావించి మెప్పించు ప్రతిభ లేకున్నను
నీవాడనే కాని పైవాడనా యేమి
సేవించు నామొరలు చిత్తగించవు స్వామి
జగముల పుట్టించి చక్కగా పోషించి
తగ లోగొను దేవా దాసుడ నేగానా
నిగమాగమవిదిత నిత్య శుధ్ధబ్రహ్మ
మగు నీవే శరణమో యభవ భవమోచన