25, మార్చి 2026, బుధవారం

వలచి పలికిన భవము వదిలించు మంత్రము

వలచి పలికిన భవము
  వదిలించు మంత్రము
తెలిసి చేసేరు రామ
  దేవుని మంత్రము

సీతమ్మ నిత్యమ్ము చింతించు మంత్రము
వాతాత్మజుం డెపుడు పాడేటి మంత్రము
ధాతయును శివుడు ధ్యానించు మంత్రము
భూతలమున పేరు పొందిన మంత్రము

ఆతతాయికు శిక్షలందించు మంత్రము
పాతకములనెల్ల వదిలించు మంత్రము
నూతనమగుచు నెపుడు నొప్పెడు మంత్రము
ప్రీతిగ సుజనుల బ్రోచెడు మంత్రము

కలనైన మరువక కమనీయ మంత్రము
కులుకుచు చేసేరు గోవిందు మంత్రము
కలిదోషముల బాపు కళ్యాణ మంత్రము
అలయక చేసేరు తులలేని మంత్రము


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.