రాముని పేరు మేఘశ్యాముని పేరు
ప్రేమమయుడైన రఘువీరుని పేరు
సురవరులును మునివరులును భక్త
వరులును నిత్యము పలికెడి పేరు
అరివీరులకును మరువగ రాక
నిరతము గుండెల నిండెడి పేరు
భవతారకమనబడియెడు పేరు
శివున కిష్టమై చెలగెడు పేరు
పవనజు డెప్పుడు పాడెడు పేరు
అవనిజ ప్రాణం బనబడు పేరు
ఇవల నవల నన్నేలెడి పేరు
చవియై రసనకు సరిపడు పేరు
పవలు రేలు నే పలికెడి పేరు
భువిని సుజనులు పొగడెడి పేరు
అభివందనములు..కుశలమా?
రిప్లయితొలగించండినా బ్లాగ్లో చూస్తూ ఉండండి
వీలున్నప్పుడు స్పందించవలసిందిగా కోరుచున్నాను.-పద్మార్పిత
పద్మార్పిత గారు,
తొలగించండికుశలమే నండీ. మీ రాక ఆనందం కలిగించింది. విభిన్న దృక్కోణంతో బహుళ జనామోదం బ్లాగును నడుపుతున్న మీరు ఇటు రావటం సందర్భానుసారం నాబోటి వానిని స్పందించ కోరటం విశేషమే. అలాగే ప్రయత్నిస్తానండి. ధన్యవాదాలు.