చుక్కలరాయని చక్కదనమును మించు
చక్కని సామికి మ్రొక్కుడయా
ముక్కంటి పెను విల్లెక్కుపెట్టి విరచి
చక్కని చుక్కను జానకీదేవిని
దక్కించు కొన్నట్టి నిక్కపు మగటిమి
నక్కజముగ జూపి నట్టి రామయ్యకు
తరచుగ నరులును సురలసురులును
పరిపరివిధముల భావించి పొగడెడి
నరపతికులపతికి ధరణిజాపతికి
నిరుపమ సద్గుణ నిధికి రామయ్యకు
మిక్కిలి పొగరెక్కి నిక్కురాకాసుల
నుక్కడగించుచు నుండెడి సామికి
చిక్కని భక్తిని చింతించు దాసుల
నెక్కుడు కరుణ మన్నించు రామయ్యకు
చాలా బాగా వచ్చింది సార్.
రిప్లయితొలగించండికీర్తన రాగయుక్తంగా బాగుంది.
రిప్లయితొలగించండిచక్కని సామికి ఎంచక్కని పొగడిక!
రిప్లయితొలగించండి