ఓ మనసా శ్రీరామచంద్రునే
యేమరక సేవించగదే
ఎవరే సుతులు ఎవరే హితులు
ఎవరే చుట్టము లిట నీకు
ఎవరెవరైనను నీభవమున నిన్ను
తవులుకొన్న బంధములే కాక
ధనము హుళక్కి దార హుళక్కి
తనువును విడచు తరుణమున
కనుగొన నీవని యనుకొను చున్నవి
వెనుక లేవు ముందును లేవు కదే
కలుగుట కల్ల తొలగుట కల్ల
ఇలపైన నీ వాడుటలు కల్ల
కలిగించునులే తెలివిడిని నీకు
కొలుచుకున్ననీ గోవిందు డిదే
అంతా కలే(ల్లే)నా ?
రిప్లయితొలగించండిబాగా వ్రాసారు.
ధన్యవాదాలు నీహారిక గారూ.
తొలగించండి