రామ కల్యాణరామ రామ కోదండరామ రామరామ రామరామ రామరామ రామరామ
తామసించి నేను రామ తప్పుదారి నుండ రామ కాముడనేవాడు రామ కష్టపెట్టుచుండె రామ ప్రేమమీఱ నిన్ను రామ పిలువనీడు వాడు రామ యేమిచేయగలను రామ యిట్లు నేను చెడితి రామ
మంచివాడ వనుచు రామ మనసిచ్చితి నీకు రామ కొంచమైన కరుణ రామ కురిపించిన చాలు రామ పంచమలము లింక రామ బాధించవు నన్ను రామ వంచకుడగు కలిని రామ వంచి గెలువగలను రామ అంతకుడు నన్ను రామ బంతులాడుచుండ రామ వింతదేహములను రామ యెంతకాలమయ్య రామ చింతలకు చిక్కి రామ చితుకుచుందునయ్య రామ పంతగించి నీవు రామ పలుకకుంటివేమి రామ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.