జేజేలు జేజేలు శ్రీరామచంద్ర నీకు
జేజేలు త్రిభువనసుస్థితికారక
పాలితాఖిలలోకజాల సద్గుణవిశాల
కాలకాల నుతశీల జేజేలు
కాలావధిలేని నీ ఘనమైన చరిత స
ఛ్ఛీలము గరపు మాకు జేజేలు
రావణాధ్యసురనాశ రామ రాజకులవిభూష
జీవలోక పరితోష జేజేలు
దేవదేవ మహోదార భావాంబర సంచార
సేవకజనసంపోష జేజేలు
ఆజానుబాహుడా అరవిందనేత్రుడా
శ్రీజానకీవిభుడ జేజేలు
రాజితసత్కీర్తి నిన్ను రోజంత పనవిపనవి
నాజిహ్వ మురియురా జేజేలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.