ఉభయభూపతనములు నుట్టుట్టి నటనలు
రభసగా నడుమ నడచు రంజైన నాటకము
వచ్చునా వాని బ్రతుకు వాడు బ్రతికి పోవునా
పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండ పోవునా
ముచ్చటగా మూణ్ణాళ్ళు ముందు గానక తిరిగి
ఎచ్చోటికి పోవునో యెగిరిపోవు నొకనాడు
ఆ లోననె యెందరిపై నలవి గాని ప్రేమలో
ఆ లోననె యెందరిపై నధికమైన పగలో
అ లోననె లోకమెల్ల నేల నెన్ని భ్రమలో
ఆ లోన పరువెత్తే కాలంబును కనడు
వచ్చిన పని యెఱుగడు పంపిన నిన్నెఱుగడు
ముచ్చటగ వేమారులు మూర్ఖుడై యిటు తిరిగి
అచ్చమైన తెలివి తిరిగి హత్తుకొనగ నొక నాడు
పిచ్చి వదలి నిన్ను చేరు వేడుకతో శ్రీరామ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.