ఊరూ పేరూ లేని వాడ వొకడవు నీవు ఊరూ పేరూ లేని వాడ నొకడను నేను |
|
వేల రూపముల నిన్నె వెదకెద నేను వేల వేషములు నాకు వేసెద వీవు ఈలాగు నొకరి కొకర మేమి తక్కువ వాలాయ మీ ముచ్చట మేలు మేలు |
ఊరూ పేరూ |
వేల పేర్లు పెట్టెద నేను పేరు లేని నీకు వేల మార్లు నాకు పేర్లు పెట్టెద వీవు ఈలాగు నొకరి కొకర మేమి తక్కువ వాలాయ మీ ముచ్చట మేలు మేలు |
ఊరూ పేరూ |
వేల క్షేత్రముల నీదు పెంపుగాంతు నేను వేల క్షేత్రముల నన్ను పెంపుసేసె దీవు పోలికల కేమిగాని పురుషోత్తముడవు ఏలికవు నాకు రామా యిదిగో దాసుడను |
ఊరూ పేరూ |
పోలిక బాగుందండి :)
రిప్లయితొలగించండిమిత్రులు శర్మగారూ, ధన్యవాదాలు.
తొలగించండిఇప్పటి వరకూ చేసిన సంకీర్తనలన్నింటినీ ఒక పేజీగా ఈబ్లాగులో ఉంచుతున్నాను పాఠకులసౌకర్యార్థం. వందకు చేరువలో ఉన్నాయి. రాముడీ దేహానికి శక్తిని యిచ్చినంతకాలమూ రోజున కొకటి చొప్పున వస్తాయని ఆశిస్తున్నాను.