| దేవుడవని మొన్ననే తెలిసికొంటిని నన్ను కావుమని నిన్ననే వేడుకొంటిని ఈవేళ వత్తువని వేచియుంటిని నీ వేవేళకు వత్తువో తెలియకుంటిని |
|
| కబురు చేయుదమంటే కనబడరే నా కెవరూ కబురు పంపుటకు నీకు కనబడలేదా ఎవరూ గుబులాయె రామ ఈ జీర్ణకుటీరము నీకు సబహుమానముగ తగిన స్వాగత మిచ్చేనా |
॥దేవుడవని॥ |
| గొప్పగొప్పవారు నిన్ను కొలువ వైకుంఠములో తప్పనిసరి పనుల మధ్య తలమునక లైతివో ఎప్పటికి వీలు చిక్కి యిటు వచ్చెదవో రామ అప్పటికే జీర్ణకుటిని ఆరగించు కాలము |
॥దేవుడవని॥ |
| వేదాంతిని కాను నేను విద్యలేవి నేర్వలేదు నీ దారితెన్నులను నేనెఱుగ నేనెఱుగ ఓ దయామయ నమ్మి యున్నాను వత్తువని వేదన లడలించవయ్య విచ్చేయ వయ్య రామ |
॥దేవుడవని॥ |
పేజీలు
▼
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.