| భగవంతుడా నీకు పదివేల దండాలు తగని తంపులు నాకు తలగట్టకు |
|||
| నీయందు మనసు తానై నిలచి యున్న వేళ మాయలు పన్ని దాని మరలించకు నా యందు పగ నీకేల నమ్మిన భక్తుడ గాన హాయిగ ధ్యానమ్ము చేయించుకో |
భగవంతుడా | ||
| ఒగి నీకు మ్రొక్కగ నుద్యమించెడు వేళ తగని తలపులతోడ తలనింపకు పగవాడనా నీకు పరమభక్తుడ గాన జగదీశ మ్రొక్కులు జరిపించుకో |
భగవంతుడా | ||
| బందాలన్నిటి ద్రెంచి బయటపడెడు వేళ అందాలవలలతోడ అలరింపకు ఎందుకు పగ నీకు ఎంతైన భక్తుడ గాన అందుకోవయ్య సేవలందుకోవయ్య |
భగవంతుడా | ||
| బృందారకాబృందవందితచరణార వింద గోవింద ముకుంద సానంద వందనములు రామచందురుడా నా యందు నీ దయను చూపి అరసి రక్షించవె |
భగవంతుడా | ||
పేజీలు
▼
మృదుభావ మధుర లలితగీతం శ్యామలీయం గారూ!
రిప్లయితొలగించండిశ్యామలీయం బ్లాగుకు స్వాగతం. ఈ కీర్తన మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
తొలగించండి