| నీ నామమకరందపానవిలోల మైనాచిత్తము మైమరచి తానెవరో తా నెఱుగదయా తానున్న గదా తన్నెఱుగ |
|||
| తనలో నీ వుండ తాను నీలో నుండ తనకు నీకును బేధమనునది లేకుండ ఘనమైన యీ సృష్టి కరిగిపోవుచు నుండ తనకేమి యునికి తనకేడ యునికి తనకేల యునికి |
నీ నామ | ||
| మనసున ప్రకృతిమాయ జొచ్చిన వేళ గుణముల నెన్ని తాను తనువున జొచ్చు తనను నీమ్రోల నుంచుకొని మురిసిన వేళ గుణముల కేయునికి తనువున కేయునికి తనకేమి యునికి |
నీ నామ | ||
| మనసు శ్రీరామతత్త్వ మందు లీనమైనది మనోలయము తారకమంత్రముచే గలిగినది మనసులేక లేదు జననమరణచక్ర మన్నది యునికి యనగ పరబ్రహ్మమునకు మాత్రమున్నది |
నీ నామ | ||
పేజీలు
▼
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.