| కలలన్నీ నీ కొఱకే కలిగినవని తెలిసెను కలరాని నాడు నీ వలిగితివని తెలిసెను |
|||
| తీయని నీ పలుకు తేనెలతో ముఱిపించి హాయిగా నా తోడ ఆడిపాడి వలపించి వేయేల నేను నీ వేనని కడు రెట్టించి పోయెదవు తెలవారిపోవులోన నమ్మించి |
కలలన్నీ | ||
| కలలలో నీ తోడ కలిసియాడుదును నేను కలిసి యాడుటే కాదు కడకు నీ యింటికి పిలిచెద వొక నాడని తెలిసియింటిని నేను నిలిపి నీ మీద యాశ నిలచియుంటిని నేను |
కలలన్నీ | ||
| నీకొఱకే నాయాట నీకొఱకే నాపాట నీకొఱకే నేలమీద నిలచి నడయాడుట నీకొఱకే నా నిదుర నీకొఱకే నా కలలు నాకు ప్రసన్నుడవు కమ్ము నా రామచంద్రుడ |
కలలన్నీ | ||
పేజీలు
▼
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.