| భగవంతుని మీరు తగిలి యుండేరో తగని తలపుల తోడ తల్లడిల్లేరో |
||
| రాముని మరచి మీరు కాముని దాసులై భూమికి బరువులనగ పొరలుచుండేరో కామితార్థములు కాంతాకనకంబు లనువారు వేమరు పుట్టి చచ్చి యేమి సాధించేరు |
||
| ఏల వీరి వారి వద్ద కాలము గడిపేరు మేలైన గురువెవ్వడు మీకు రాముని కన్న చాలింతురో వెఱ్ఱి సాకులు మీఱింక బేలలై తప్పుడు త్రోవల పాలయ్యేరో |
||
| ఇతరుల మాటలెన్ని యిడుములు కుడుచేరో పతియుగతియు రాముడన్న హితమెంచేరో మతిలేని వాదాలు మానక చేసేరో మతిమంతులై రామమార్గ మెన్నేరో |
||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.