| తానుండు నన్నాళ్ళె తన దీతనువు తాను తొలగిన నాడు తన కేమి కాదు |
|||
తనివార మైపూతల నద్ది ముఱిసేను తినుటకె పుట్టిన దనునట్లు పెంచేను తనభోగముల కెంతొ తహతహ లాడేను తనకాల మఱుదెంచ తానిట్టె వీడేను |
తానుండు |
||
కొఱగాని కాసులు కొన్ని గడించేను మరి మేను శాశ్వతమన్నట్లు బ్రతికేను ధరనిండ బంధుసంతతి చాల నించేను తరుణము కాగానె తానిట్టె తరలేను |
తానుండు |
||
ధీమంతుడు నిజము తెలిసి చరించేను కామాదుల విడచి రాముని కొలిచేను రామదాసుడ తిరిగి రానని పలికేను క్షేమదాయకు నింట చేరగ తరలేను |
తానుండు |
||
పేజీలు
▼
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.