నామాటలకు జాల నవ్వుకొనెడు వారు నావారలే యది నా కెఱుకయె నాపైన వైరంబు నడిపించువారును నావారలే యది నా కెఱుకయె నా యందు ప్రేముడి నటియించువారును నావారలే యది నా కెఱుకయె నాయున్కి నెఱుగమి నటియించువారును నావారలే యది నా కెఱుకయె నాదు ప్రస్తుతజీవననాటకమున కథను రక్తికట్టించగా కలిగి నట్టి పాత్రలుగ వీరినెంచద సూత్రధారి వీవటంచును గమనింతు నీశ యెపుడు |
హితులు,సన్నిహితులు అందరూ కావలసినవాళ్ళే
రిప్లయితొలగించండిఅదీ వ్రాసానండీ, తరువాతి వివేచనా పద్యంలో!
తొలగించండి