నేటి వారికి జెప్పు నేర్పుగలాడనే నేరు పట్టిది చూడ నీక చెల్లు నేటి వారల మేథ నాకింతయును లేదు దాని మించిన మేథ తనరు నీక నేటి కాలంబున నామాట లతుకవు కాలోచితప్రజ్ఞ గలుగు నీక నేటి వర్తనములు నే నేర్వగా లేను నేరుపు లన్నియు నేర్తువీవ నిన్న చెల్లితినో లేదొ నేనెఱుంగ నేడు చెల్లుట కనరామి నిశ్చయంబు నేడు రేపను బేధంబు నీకు లేదు నేటి వారిని నడిపించ నీక తగును |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.