ఆర్తి తీర్చవమ్మ అరుణమ్మా నీ కీర్తి కూడ పెరిగేనోయమ్మా |
||
లెక్కకు మిక్కిలి లోకము లేలెడు ముక్కంటి తనువున మురిసే తల్లీ చక్కని తల్లీ చల్లని తల్లీ తక్కువ లేని దయచూప వమ్మా |
॥ఆర్తి ॥ | |
పున్నమ చంద్రుని పోలెడు మోమున సన్నని నగవుల వెన్నెల లొలయగ అన్ని జగంబుల అతిదయ నేలుచు మన్నించెదవే మా తల్లీ ఇక |
॥ఆర్తి ॥ | |
మంచుకొండకు మంచి కూతురవు మంచివారకి మంచి తల్లివిగ అంచితమగు నీ అభిమానము నా కించుక దయతో నీ యవె తల్లీ |
॥ఆర్తి ॥ | |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.