పేజీలు

21, మార్చి 2026, శనివారం

కళ్ళు రెండు చాలవే

కళ్ళు రెండు చాలవే వేయి
కళ్ళున్నను జాలవే

కాళ్ళకు గజ్జెలు కట్టి
ఆడే కృష్ణుని జూడ
కళ్ళు రెండు చాలవే
వ్రేళ్ళ కుంగ్రాలు మెరయ
క్రేళ్ళుబ్బు హరి జూడ
కళ్ళు రెండు చాలవే

పిల్లనగ్రోవి బట్టి
గొల్ల కన్నెల మధ్య
చల్లని నగవులతో
అల్లన నాడుచున్న
నల్లనయ్యను జూడ
కళ్ళు రెండు చాలవే

బుల్లి నెమలి యీక
కుళ్ళాయి మీద మెరయు
ఫుల్లాంబురుహ నయను
ఉల్లము రంజిల్లగను
కళ్ళార జూతు మన్న
కళ్ళు రెండు చాలవే

3 కామెంట్‌లు:

  1. చక్కని పద్యాలు వ్రాసే రాజారావు గారికి గొప్ప రామ సంకీర్తనలు వ్రాసే మీకు మధ్య అనవసర వివాదం సృష్టించిన నికృష్ట జీవి జిలేబీ. ఆ మాయావి ఉచ్చులో పడవద్దని మనవి.
    శ్రీరామ నవమి సమీపించు వేళ వాడ ప్రతివాదాలు వేదన మిగుల్చగలవు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాపని నేను చేసుకుంటూ వెళ్ళటమే నాకర్తవ్య మండీ.

      నది ప్రవహిస్తూ వెళ్ళే క్రమంలో మైదానాలూ లోయలూ వనాలూ ముళ్ళపొదలూ మరుభూములూ పర్వతాలూ వంటివి ఎన్నెన్నో ఎదురౌతూనే ఉంటాయి. ప్రయాణం ఐతే ఆగదు కదా. కొన్ని సార్లు అడ్డంకులు తొలగిపోతాయి మరి కొన్ని సార్లు నదియే తప్పుకొని ముందుకు సాగుతుంది.

      సహజమైన దానికి విచారం లేదు. వేదన అవసరం లేదండి.

      తొలగించండి
  2. వినరా ( విన్నకోట నరసింహా రావు ) గారు బ్లాగులోకం లో కనిపించి చాలాకాలం అయ్యింది. మీకు వారి గురించిన సమాచారం ఉందా చెప్పగలరు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.