6, సెప్టెంబర్ 2014, శనివారం

హైదరాబాదు ప్రాంతం తెలుగు బ్లాగర్ల సమావేశం


హైదరాబాదు ప్రాంతం తెలుగు బ్లాగర్ల సమావేశం   


అవునండీ.  హైదరాబాదు ప్రాంతం తెలుగు బ్లాగర్ల సమావేశం ఒకటి జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాను. హైదరాబాదు ప్రాంతం అనటానికి కారణం, ఈ‌తొలి అడుగుకు దూరప్రాంతాల్లో ఉన్న తెలుగుబ్లాగర్లు వ్యయప్రయాసలు పడతారన్న ఆలోచనే. ఇది కేవలం తొలి అడుగు.  బహుశః చిన్న సమావేశం స్థాయిలో జరగవచ్చును ఇది.

బ్లాగులోకం చర్చించవలసిన ఎన్నో విషయాలున్నాయి. ముఖ్యంగా గ్రంధచౌర్యం. దీనికి విరక్తి చెంది శ్రీశర్మగారు (కష్టేఫలే బ్లాగు)  తన బ్లాగుని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు.

మన తెలుగు బ్లాగులోకం  అవసరాలు, పరిస్థితులు, ఇబ్బందులు, ప్రమాణాలు వంటి అన్ని విషయాలలోనూ కొంత చర్చ జరగటం చాలా అవసరం అన్న దృష్టి కలిగింది నాకు.  చెల్లాచెదురుగా ఉన్న బ్లాగర్లు తెలుగుబ్లాగుల స్థాయిని పెంచేందుకు కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందని హెచ్చుమందిమి అనుకున్న రోజున, అలా అలోచించి వ్రాసిన రోజున తెలుగుబ్లాగుల స్థాయి తప్పకుండా పెరుగుతుంది.  నా అభిప్రాయంతో అందరూ ఏకీభవించాలని లేదు. కాని హెచ్చుమంది ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను.

నాకు తెలిసి ఎక్కువమంది బ్లాగర్లు ఉదోగబాధ్యతలు కలవారు. అందుచేత ఏ వారాంతంలోనో కాని వారికి తీరిక ఉండదు. అలాగే దీర్ఘసమావేశాలను అస్వాదించే తీరికా ఓపికా కూడ వారికి ఉండటం కష్టమే. నా పరిస్థితి కూడా అదే.  అందుచేత మన సమావేశం కూడా ఒక రెండుగంటల వ్యవధిలో జరిగేలా ప్రణాళిక వేసుకుంటే బాగుంటుంది.

అసలు‌ ఈ‌ సమావేశం మనం జరుపుకుందామా వద్దా? జరిపుకొనే పక్షంలో ఎప్పుడు, ఎక్కడ వంటి విషయాలను అందరమూ ముందే సంప్రదించుకుందాం.  ఈ నా విజ్ఞప్తికి వచ్చే స్పందనను బట్టి తదుపరి వ్యవహారం ఉంటుంది. కానీ ఈ‌సమావేసం సాధ్యమైనంత తొందరగా జరగటం బాగుంటుంది - అందరూ కలిసివస్తే.

అందరూ ఆలోచించండి.  ఏ విషయమూ చెప్పండి.

కొంతమంది బ్లాగర్ల వివరాలు పబ్లిక్‌గా ఉండవు. వారి కారణాలు వారివి. ఐనా లభ్యంగా ఉన్న వివరాలూ సమగ్రం కాకపోవచ్చును చాలా సందర్భంలో.

బ్లాగర్లు దయచేసి తమ వ్యక్తిగత వివరాలను క్రింద వ్యాఖ్యల్లో ఇవ్వకండి. మీరు నాకు నేరుగా మెయిల్ పంపితే నాకు సదుపాయంగా ఉంటుంది, మీ ప్రైవసీకీ రక్షణగా ఉంటుంది.

నా మెయిల్ చిరునామా:
s y a m a l a  DOT  t a d i g a d a p a  AT  g m a i l  DOT   c o m

సబ్జెక్ట్ లైన్‌లో సమావేశం గురించి ప్రస్తావించండి.
పూర్తిపేరు, పరిచయం, ఫోన్ నంబరూ తప్పక పంపండి.
మీరు ప్రస్తావించదలచుకొన్న ఇతరవిషయాలు వ్యాఖ్యల్లో ఉంచినా అభ్యంతరం లేదు.

ఈ కార్యక్రమం జరిగేదీ లేనిదీ నిర్ణయించేది మీరే.
మీ స్పందనల కోసం ఎదురుచూస్తూ ఉంటాను.17 వ్యాఖ్యలు:

 1. శ్యామలీయం గారూ ! బ్లాగర్లను సంఘటితం చేస్తే తెలుగు బ్లాగులు బలపడుతాయన్న మీ ఆలోచన బాగా ఉంది . దీనికి హైదరాబాద్ లో సమావేశం నిర్వహించాలన్న మీ సంకల్పమూ హర్షణీయమే
  ఒకప్పుడు గొప్ప బ్లాగర్లుగా పేరొందిన బ్లాగర్లు ప్రస్తుతం ఆ వృత్తినే వదిలివేయడానికి ప్రధాన కారణాలు - వృత్తిరీత్యా బిజీగా అయిపోవడమూ , కుటుంబ/వ్యక్తిగత బాధ్యతలూ ఇంకా వ్యాఖ్యల ద్వారా తిట్లూ విమర్సలూ భరించలేక ! ప్రధాన బ్లాగర్లందరూ నిష్క్రమించాక బ్లాగులోకం కళ తప్పింది . కొందరు పేరుకోసం , డబ్బుకోసం వ్రాయడం ప్రారంభించారు . కొందరు నిత్యం ఆగ్రిగేటర్లలో తమ పేరు కనిపించడం కోసం వ్రాయసాగారు . వీరి దగ్గర కంటెంట్ లేదు మరి ఏమి చేస్తారు ? అక్కడా - ఇక్కడా కొట్టుకొస్తారు . మంచి కంటెంట్ ఎక్కడినుండో ఎత్తుకొస్తే సహించవచ్చు. కానీ కనీసం నిజమైన లింక్ ఇవ్వరు . నిజ రచయితకు కృతజ్ఞతలు కూడా చెప్పరు కామెంట్ల కోసం ప్రశ్నలు వేస్తారు. వారే ఐడిలు సృష్టించుకొని కామంట్లు వ్రాసుకుంటారు . దీనిలో దూరే మనలాంటి వారిపై అన్నివైపుల నుంచీ దాడి చేస్తారు . ఒక బ్లాగులో కనిపించే కామెంటేటర్లు మరో బ్లాగులో కనిపించరు . ఒకవేళ ఏ బ్లాగరైనా ఓ మంచి కవితో కధో వ్రాస్తే ఒక్క కామెంట్ రాదు . మరి వీరి అనవసర చర్చలకు వ్యాఖ్యాతలు ఎక్కడి నుండి వస్తున్నారు ? ఒక మంచి పనికి ప్రోత్సాహం ముఖ్యం . మంచి కవితగానీ కదా గానీ వచ్చినప్పుడు కనీసం ఒక ప్రోత్సాహక కామెంట్ వ్రాస్తే తప్పేమిటి ? .. ఇంకీ ఏంటో చెప్పాలని ఉంది .. ఈ విషయాలన్నీ సమావేశంలో చర్చించే ఏర్పాటు చేస్తారని భావిస్తున్నాను .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సాయికుమార్ గారూ, స్పందనకు ధన్యవాదాలు. టపాలో‌ కొత్త విషయాలు జోడించాను. పరిశీలించండి.
   దీర్ఘచర్చలు కష్టం. అన్ని విషయాలు ముందుగా చర్చించి నిర్ణయిద్దాం సరేనా?

   తొలగించు
 2. సాయి కుమార్ గారు బాధపడుతూ చెప్పిన విషయాలతో పూర్తిగా అంగీకరిస్తాను. కాని, బ్లాగుల్లో ఉన్న అనారోగ్యకరమైన, అభ్యంతరకరమైన అలవాట్లను మనం వ్యక్తిగతంగా కలుసుకున్నంత మాత్రాన పోగొట్టగలమా అని నా అనుమానం. మన బ్లాగులో మనం నిక్కచ్చిగా మనమే వ్రాసిన విషయం (original content for which we can claim copy right) మరెవరన్నా కాపీకొడితే అలాంటి వాణ్ణి ఎండగట్టే ధైర్యం ఉండాలి. అలాంటి బ్లాగులోకి వెళ్ళి కడిగిపారెయ్యాలి. వాడు మన కామెంట్ వేసుకోకపోతే, మన బ్లాగులోనే వాడి పేరు పెట్టి (మన కంటెంటు వాడు కాపీ కొట్టినది, మన దగ్గర సాఫ్ట్ ఫైలుగా పదిలపరుచుకుని) అలాంటివాడు చేసిన వెధవపని నలుగురికీ తెలిసేట్టుగా వ్రాయాలి. మనం వ్రాసుకున్నవి వేరెవరో దొంగిలించినా సరే, వణికిపోతూ, భయం భయంగా ఏదో రెండు ముక్కలు అలా కాపీ కొట్టినవాడికి నమస్కారాలు చెబుతూ వ్రాసి, నా బ్లాగు అమ్మేసుకుంటాను అంటే ఏమిటి ఉపయోగం. ఆ మాత్రానికి దొంగ పనిచేస్తున్న వాళ్ళు భయపడతారా, బాగుపడతారా. మన కాపీ రైట్ ను మనమే సంరక్షించుకోవాలి, ఎవరూ వచ్చి రక్షించరు. మనకున్న హక్కుల మీద పడి నిద్రపోతే, లేదా ఆ హక్కులని పరిరక్షించుకునే ధైర్యం లేకపోతే, ఆ హక్కులు మన నుంచి జారిపోతాయి. దీనినే Law లో "Sleeping on one's right" అని కాబోలు అంటారు.

  ఒక బ్లాగులో వ్రాసిన ఒరిజినల్ కంటెంటు వేరొక బ్లాగు కాపీ కొట్టటం విషయంలో, నాదొక సూచన. ఇలాంటి విషయాలకి కూడలి/మాలిక వంటి యాగ్రిగేటర్లు కొన్ని నియమ నిబంధనలు పెట్టాలి, వారి వారి యాగ్రిగేటర్లకు అనుసంధించి ఉన్న బ్లాగర్ల దగ్గర నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించి, ఫిర్యాదు గురించి నిస్పక్షపాత దర్యాప్తు జరిపి ఆ పైన, ఆ ఫిర్యాదు సరైనది ఐతే, ఎవరి బ్లాగు మీదైతే ఫిర్యాదు చెయ్యబడినదో అటువంటి బ్లాగును యాగ్రిగేటర్ నుంచి తొలగించి, ఎందుకు తొలగిస్తున్నారో కారణంతో సహా ప్రముఖంగా యాగ్రిగేటర్లో ప్రకటించాలి. తరువాత ప్రతి చెత్త తీసుకొచ్చి యాగ్రిగేటర్లల్లో కలప కూడదు. ప్రస్తుతానికి చూడండి, యాగ్రిగేటర్లో కనపడింది కదా అని క్లిక్ చేస్తే అక్కడ ఒక్క లైను ఉండి, అక్కడనుంచి ఒక లింకు వ్యాపార పరమైన వెబ్సైటుకు దారి తీస్తుంది. అవ్వి బ్లాగులు కావు. బ్లాగుల రూపేణా ఉన్న వ్యాపార వెబ్ సైటులు. వాటిని యాగ్రిగేటర్లల్లో ఎందుకు అనుసంధించాలి? యాగ్రిగేటర్లు, హాబీగా బ్లాగులు వ్రాసుకునే వారికి సౌకర్యంగా అన్నీ ఒకచోట కనపడేట్టు చేస్తూ ఆ రూపేణా వారికి ఉన్న పుస్తకాలు అమ్ముకోవటమో, లేదా కొద్దిగా వ్యాపార ప్రకటనలు తీసుకోవటమో చెయ్యాలి. ప్రతి వెబ్ సైటు కూడా యాగ్రిగేటర్లో కలపటానికి బ్లాగులను దుర్వినియోగ పరుస్తుంటే చూస్తూ ఊరుకుంటే యాగ్రిగేటర్ దేనికి? యాగ్రిగేటర్లకు బ్లాగులను తమ యాగ్రిగేటర్లో కలపటం విషయంలో డబ్బు సంపాదనే ముఖ్యమైతే, మన బ్లాగులను వారి యాగ్రిగేటర్లో ఉచితంగా కనపడేట్టుగా ఎందుకు ఇవ్వాలి. గూగుల్ వాడు మనకు బ్లాగులను నిర్వహించుకోవటానికి చోటు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి మనం వాటిని కష్టపడి వ్రాసి యాగ్రిగేటర్లకు ఉచితంగా ఇస్తే వాళ్ళు ఇవ్వన్నీ అక్కడ కలిపి చూపిస్తూ, డబ్బులు సంపాయించుకుంటారా!? వ్యాపార పరమైన వెబ్ సైట్లు, బ్లాగుల్లా కనపడుతూ వారి వారి వ్యాపార వెబ్ సైట్లకు లింకులు ఇస్తున్న విషయం మీద కూడలి వారికి రెండు మూడుసార్లు మైళ్ళు ఇస్తే, ఏదో సమాధానం వచ్చేది కొన్నిసార్లు అదీ లేదు. అందుకని వాళ్ళకి నా బ్లాగులన్నీ వారి యాగ్రిగేటర్ నుంచి తొలగించమని విన్నవించి తొలగింప చేశాను. ఇలా చేసినందువల్ల వాళ్ళకు ఏదో తగ్గుతుందనీ కాదు, వాళ్ళ "కార్పొరేట్ పాలసీ" మార్చుంటారనీ కాదు. నా బ్లాగులు, బ్లాగుల్లా కనపడే కమర్షియల్ వెబ్సైట్స్ తో పాటు కనపడవు. అంతే! ప్రస్తుతానికి మాలిక, పూదండలో మాత్రమే నా బ్లాగుల్లో వ్రాసినది కనపడుతుంది. వీటిని కూడా ఒకసారి సమీక్షించుకోవాలి, టైము దొరికినప్పుడు!

  ఒక నగరానికి సంబంధించీ బ్లాగర్లు అందరూ కలవటం బాగానే ఉంటుంది. మునుపు, హైదరాబాదులో నెలకొక్క సారి అనుకుంటా అలా కలుసుకునేవారు. కాని అలా కలిసి ఒకరినొకరు తెలుసుకోవటం, స్నేహం పెరగటం తప్ప, బ్లాగుల పరంగా ఒరిగేదేమీ ఉండదని నా అభిప్రాయం. నేను ముంబాయి నుంచి హైదరాబాదు వచ్చినప్పుడల్లా కొందరు బ్లాగర్లను కలుసుకుంటూనే ఉంటాను, ఇష్టాగోష్టిగా సంభాషణ జరుగుతుంది. చివరకు చెప్పోచ్చేది ఏమంటే, బ్లాగింగి అనేది ఎవరికి వారు వ్రాసుకునేది కాని, స్టాంప్ కలెక్షన్ లాగ, ఓక చోట కలిసి, ఒకరి దగ్గర లేని స్టాంప్ మరొకరి దగ్గర అదేస్టాంపు రెండు ఉంటే ఇచ్చి పుచ్చుకోవటాలు కుదరవు కదా. అనారోగ్య వాతావరణం అంటూ ఉందని మనం అనుకున్నప్పుడు, ఎవరి బ్లాగుల్లో వాళ్ళు, వాళ్ళ దృష్టిలో ఆ అనారోగ్య ధోరణులు ఏమిటి, వాటికి ఉన్న హేతువులు, అన్నిటికి మించి అలా ఎవరు చేస్తున్నారో పేరుపెట్టి మరీ వ్రాయగలమా! అలా లేనప్పుడు మీటింగులు పెట్టుకుని ఏమిటి ఉపయోగం !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిత్రులు శివరామశర్మగారికి నమస్కారం. మీ సుదీర్ఘవ్యాఖ్యలో కొన్ని విషయాలు ప్రస్తావించారు.

   శ్రీ కష్టేఫలీ శర్మగారి నిర్ణయం గురిం మీకు అసంతృప్తి ఉందని గమనించాను. బ్లాగర్లలో అనేకులకు వారి నిర్ణయం బాధకలిగించేదే. కాని శర్మగారి ఆవేదననూ మనం దృష్టిలో ఉంచుకోవాలి. వారిది యుధ్ధాలకు సై అనే వయస్సు కాదని మనం గుర్తుంచుకోవాలి. కొందరు ఇంటిదొంగల నిర్వాకం వల్ల తెలుగుబ్లాగుల కుటుంబంలో నుండి ఒక పెద్దవారు క్షోభపడి నిష్క్రమిస్తున్నారు! ఇది మనకు జయం కాదు.

   కొన్ని నకిలీ బ్లాగులనూ కొందరు ముసుగుదొంగలనూ మనం గమనించి దూరం చేయగలిగినా పెద్దగా ఉపయోగం ఉండదు. అగ్రిగేటర్లనుండి అటువంటి చెత్తను తప్పిస్తే వారి నుండి మనం దృష్టి మరల్చుకోవటం జరుగుతున్నదే కాని వారి బుధ్ధిని సరైనదారిలోనికి మరలిస్తున్నది జరగటం జరగదు కదా. ఈ విషయంలో ఏం చేయగలమో కూడా ఆలోచించవలసి ఉంది.

   హైదరాబాదీ బ్లాగర్లు లోగడ కలుసుకుంటూ ఉండే వారన్న సంగతి నాకు ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది. బహుశః ప్రముఖబ్లాగర్లు కొందరు అలా ఇష్టాగోష్టిగా కలుసుకుంటూ ఉండేవారేమో. ఈ సమావేశం ఇష్టాగోష్టి అనుకోవటం లేదు. అలాగే ప్రముఖబ్లాగర్లని మాత్రమే పాల్గొనవలసిందిగా కోరటమూ జరగటం లేదు. ఈ సమావేశం ఒక ముందడుగు మాత్రమే. ప్రయోజనం అణుమాత్రం సిధ్ధించినా మరికొన్ని ఇలాంటి లేదా ఇంతకన్నా స్పష్టమైన ప్రయోజనాన్ని ఆశించే సమావేశాలు జరగవచ్చును. మన తెలుగువారికి ప్రత్యేకమైన ఆరంభశూరత్వం కారణంగా ఏమీ జరుగకపోవచ్చును. కాని ప్రయత్నం చేయటంలో తప్పులేదని అనుకుంటాను. యత్నే కృతే యది నసిధ్యతి కోత్ర దోషః?

   తొలగించు
  2. శ్యామలీయం గారూ,

   శర్మగారి వేదన తెలుస్తూనే ఉంది. నేను చెప్పేది తగాదా పడమని, యుధ్ధానికి వెళ్ళమని కాదు చెప్పేది. మన హక్కులను కాపాడుకోవటానికి మనం కొంతలో కొంత పోరాడవలసి ఉంటుంది. అంటే కత్తీ డాలు పట్టుకుని బయలుదేరమని కాదు. మన హక్కులు కాపాడుకోవటానికి వయస్సుతో సంబంధం లేదు. భయపడి వెళ్ళిపోయి మనమేమీ సాధించలేము, అటువంటి చర్యలు చెత్తగాళ్ళకు ఊతం ఇచ్చేదిగా ఉంటాయని నా అభిప్రాయం. శర్మగారు, తన బ్లాగులోనే తన కాపీ రైటెడ్ కంటెంట్ ఎవరు దొంగిలించారో పేర్లు వ్రాయవలిసింది. వాళ్ళకి నమస్కారాలు పెడితే ఏమిటి లాభం!? సరే ఎవరి టెంపరిమెంట్ వారిది. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలంటే, అసలు వ్యక్తులు ముందుండాలి, చివరి వరకూ గట్టిగా నిలబడాలి.

   ఇక మీ అభిప్రాయం కాపీ కొట్టేవాళ్ళ బ్లాగులు తొలిగిస్తే,ఏమిటి లాభం వాళ్ళకి బుధ్ధి వస్తుందా అని. అలా యాగ్రిగేటర్లనుంచి కారణం ఫలానా అని చెప్పి తొలగిస్తే కొంతలో కొంతన్నా వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకునే అవకాశం ఉన్నది అని నా అవగాహన. వ్యాపార వెబ్ సైట్లను యాగ్రిగేటర్లనుంచి తొలగిస్తే ఏమిటి లాభం? ఒక్కటే ఏమిటి అంటె, వాళ్ళు ఇక యాగ్రిగేటర్లో కనపడరు, ఇతరులు ఆ వెబ్ సైటు చూడటానికి యాగ్రిగేటర్ ఒక సాధనం అవ్వదు, మనం వ్రాసుకునే వ్యాసాల మధ్య, వ్యాపార వెబ్ సైట్లు కనపడవు అంతే.

   బ్లాగర్ అనేమాటకు ముందు నేనెక్కడా "ప్రముఖ" అనేమాట వాడలేదు. బ్లాగర్లల్లో ప్రముఖ బ్లాగర్లెవరని నిర్ణయిస్తాము? వయస్సా, వ్రాసే విషయమా, లేకపోతే రోజుకు మూడు నాలుగు పోస్టులు రెండేసి లైన్లవి వేసేవాళ్ళ? అందరూ బ్లాగర్లే, ఇందులో ప్రముఖ, ప్రాముఖ్యం లేని అనేది ఉండదని, ఉండకూడదని నా భావన. నేను చెప్పినది, హైదరాబాదులో కొంత కాలం క్రితం "బ్లాగర్లు" కొందరు నెలకొక్క సారో మూణ్ణెల్లక్కొక్క సారో కలిసేవారు. ఇప్పుడు మీరు ఒక బ్లాగర్ల సమావేశం ఏర్పరచాలని ప్రతిపాదిస్తున్నారు కదా అందుకని ఇదొక సమాచారం కింద మీకు అందించాను అంతే.

   ఆంధ్రుల ఆరంభ శూరత్వం గురించి మీ స్పందనలో బాగా గుర్తు చేశారు. మీరు తలబెట్టే సమావేశం అలాంటి శూరత్వం కాకూడదని, కాకుండా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

   తొలగించు
 3. ముందుగా ... బ్లాగర్ల సమావేశం జరుపతలపెట్టడం అభినందనీయం ! కానీ దానికి ఇది సందర్భం కాదేమోనని నా అనుమానం. ఎందుకంటే ప్రస్తుతం బ్లాగర్లలో నెలకొని ఉన్న నిర్లిప్తత ( దీని గురించి నేను అనేక సార్లు ప్రస్తావించాను ) సమావేశానికి వారిని తీసుకువస్తుందని నేననుకోను .
  మీలాంటి పెద్దలు బ్లాగులో చర్చల ద్వారా బ్లాగర్లకు , ఆగ్రిగేటర్ లకు కొన్ని దిశా నిర్దేశాలు చేయవచ్చు . శివరామ ప్రసాద్ గారు చెప్పినట్లు ఆగ్రిగేటర్ లలో కూడా మార్పు , విషయాలపై తక్షణ స్పందన వావాల్సిన అవసరం ఉంది . ఈ విషయంలో బ్లాగిల్లు ముందుందని నేను నమ్ముతున్నాను . శర్మగారు ఏ ఏ బ్లాగులు తన టపాలను కాపీ కొడుతున్నారో తెలియచేయగానే వాటిని బ్లాగిల్లు నుండి తొలగించి బ్లాక్ లిస్టు లో పెట్టాను . గతంలో రెండు మూడుసార్లు ఇలానే చేయడం జరిగింది .
  ఒక సంకలినిలో నానా చెత్తా మంచి టపాల మధ్య రావడానికి నాకు ఎంతమాత్రం ఇష్టం ఉండదు . అందుకే కొద్ది రోజుల క్రితమే 'ఎంపికచేసిన టపాలు' పేరుతొ రోజుకి మూడుసార్లు బులెటిన్ విడుదల ప్రక్రియ ప్రారంభించింది. http://blogillu.blogspot.com/search/label/selected
  లింకులో మీరు దాన్ని చూడొచ్చు.
  ఉత్తమ బ్లాగులు విభాగంలో మంచి బ్లాగుల స్కోరింగ్ ఇస్తున్నాను .
  అంటే కాదు బ్లాగర్ల శ్రేయస్సు కోసం నా వంతు ఏమి చేయడానికైనా రెడీ మీలాంటి పెద్దలంతా కలిసి దిశా నిర్దేశం చేయండి .. ఆల్ ద బెస్ట్

  ప్రత్యుత్తరంతొలగించు
 4. బ్లాగర్ల సమావేశం ఆలోచన బాగున్నది... అయితే అది ఏ హైదరాబాదు నేల మీద కాకుండా....ఎదో ఒక

  బ్లాగులో ఆన్ లైన్ లో అయితే బాగుంటుంది... ముందరగా వెన్యు బ్లాగుని.... టైము, డేటూ నిర్ణయించి,

  ఈ విషయం గురించి బ్లాగుల్లో ప్రచారం చేస్తే, చాలా మంది పాల్గొనే అవకాశం ఉన్నది...

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిత్రులు రాధాకృష్ణగారి సూచన కూడా బాగుంది. నిజానికి నాకు కూడా ఇటువం దొకటి 'బ్లాగర్లబ్లాగ్' వంటి ప్రత్యేకమైన బ్లాగు ఒకటి తెఱచి, దానిని అందరు బ్లాగర్లూ కలిసి నిర్వహిస్తే బాగుంటుందని అలోచన వచ్చింది. కాని ఆచరణసాధ్యం కాదని విరమించుకున్నాను. ఒకసారి ముఖాముఖీ వీలైనంతమంది కూర్చుని మంచి వాతావరణంలో తీరుతెన్నులూ బాగోగులూ చర్చించుకుంటేనే బాగుంటుందని నిశ్చయం కలిగి ఈ విధంగా ముందుకు వచ్చాను. చూదాం. అందరం కలిసి ఆలోచించి నిర్ణయిద్దాం ఏ విధంగా మార్పుకోసం ప్రయత్నించగలం అన్నది.

   తొలగించు
 5. ఆన్ లైన్ చాట్ రూం లో ఒక సమయం నిర్ణయించి అందరూ కలిసే ఏర్పాటు చేయండి

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @Radhakrishna, @Srinivas,

  Good idea. Since the problems expressed do not pertain to Hyderabadi Bloggers alone, the discussion can be online in a blog or Chat Room where the coverage will be very wide across the world and many Bloggers can participate.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. Yes, definitely a good idea. Agreed that the problems expressed do not pertain to Hyderabadi Bloggers alone. I have already quoted my reasons to call it a meet of bloggers of Hyderabad region. I am not sure whether we can handle a meet of bloggers all over the world. May be, but just unsure. Though it would be great to see a whole lot of bloggers appear in the chat room to participate, it could be difficult to handle one like that - may be not - I have not ever managed a chat room so far.

   తొలగించు
 7. ప్రత్యుత్తరాలు
  1. రాజకీయ చర్చలూ, ఆవేశకావేశాలకోసం కాదండి సమావేశాన్ని ఉద్దేశించినది. అదీ కాక మీరు ఫలానివారు మీ మిత్రులు అన నక్కర లేదు. నాకు శత్రువులు ఎవ్వరూ లేరు - నా దృష్టిలో - అంతా నా మిత్రులే. మీకు నా చొరవ విడ్డూరంగా కనిపించిందన్నారు. దానికి నేనేమీ చేయలేను కదా? యధాస్మై రోచతే విశ్వం –తదే దం పరి వర్తతే. ఆలోచనలు కలబోసుకొని నిర్మాణాత్మకకృషికి మీ వంతు ప్రయత్నం చేయటానికి మీకు సదా ఆహ్వానం. అల్లరి చేయటనికి ఐతే - దాని వలన మీకూ ఇతరులకూ ఒరిగేది ఏమీ లేదు కాబట్టి - మీకు అహ్వానం లేదు.

   తొలగించు
 8. కూడలి/మాలిక వంటి యాగ్రిగేటర్లు కొన్ని నియమ నిబంధనలు పెట్టాలి, వారి వారి యాగ్రిగేటర్లకు అనుసంధించి ఉన్న బ్లాగర్ల దగ్గర నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించి, ఫిర్యాదు గురించి నిస్పక్షపాత దర్యాప్తు జరిపి ఆ పైన, ఆ ఫిర్యాదు సరైనది ఐతే, ఎవరి బ్లాగు మీదైతే ఫిర్యాదు చెయ్యబడినదో అటువంటి బ్లాగును యాగ్రిగేటర్ నుంచి తొలగించి, ఎందుకు తొలగిస్తున్నారో కారణంతో సహా ప్రముఖంగా యాగ్రిగేటర్లో ప్రకటించాలి.
  _________________________________________________________________

  We removed a few blogs upon such complaints.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. But this action, though justified entirely, would have the side effect of leaving the bloggers blind to further activities of these copy cats! The harm wont go away just because we close our eyes to it.

   తొలగించు

 9. శ్యామలీయం వారు,

  మీ ఈ ప్రయత్నం విజయ వంతం కావాలని కోరు కుంటూ

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీగారు, విజయవంతం కావటం కావటం వలన బ్లాగులోకాని కొద్దోగొప్పే మేలు జరగవచ్చును కాబట్టి విజయవంతం కావాలనే నేనూ ఆశిస్తున్నాను. కాని ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందో అసలు జరిగేనో అన్నది ప్రశ్నార్థకంగానే ఉందండి.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.