21, సెప్టెంబర్ 2016, బుధవారం

హరిసమ్మతి గొని యారంభించినహరిసమ్మతి గొని యారంభించిన
వన్నికార్యముల నమితము జయము

హరియనుమతమున నంబరీషుడు
హరివాసరవ్రత వ్యగ్రుడు గావున
పరమోగ్రుడు దుర్వాసుని క్రోధము
కరుణను హరి చక్రముచే నణచె
హరి

హరియనుమతమున అర్జునుడు సం
గరమొనరించెను కౌరవతతితో
కెరలు భీష్మగురువరులను గెలిచెను
దురమున నరదము హరినడిపించగ
హరి

హరియనుమతమున నాడుచుంటిని
ధరపై నేనా దశరథరాముడు
తిరముగ మదిలో తేజరిల్లగ
కరమనురక్తిని కడగి పొగడుచును
హరి
2 వ్యాఖ్యలు:

 1. నాహం కర్తాః హరిః కర్తా!

  అనారోగ్యంతో బ్లాగుల్లోకి రాలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిత్రులు శర్మ గారికి సాదర పునఃస్వాగతం.
   రామకృపవలన ఇప్పుడంతా బాగుందని ఆశిస్తున్నాను.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.