1, సెప్టెంబర్ 2016, గురువారం

నీకు సంతోషము నాకు సంతోషమునీకును నాకును నెయ్యము కలదని
నీకు సంతోషము నాకు సంతోషము

తెలిసీతెలియని దేబె స్నేహమని
తలచవు నన్ను చులకన చేయవు
పిలిచెద నేను ప్రేముడి మీఱగ
పలికెద వీవు పరమాదరమున
నీకును

నీవాడ నైతిని నీకు సంతోషము
నావాడ వైతివి నాకు సంతోషము
నీవేడ నేనేడ నావాడ వటనె
నీ విలాస మిది నిజమగు భాగ్యము
నీకును

వేల భవముల విరిసిన మైత్రి
నీలాగునే సాగ నీయుము రామ
చాలు నిన్నంటియుండు సద్భాగ్యమే
చాలు చాలు నాకు చాలును రామ
నీకును
2 వ్యాఖ్యలు:

  1. చాలా బాగుంది సార్ భక్తి భావం నిండిన ఈ పాట. మీ పాటలను బాలకృష్ణప్రసాద్ గారు వంటి గొప్పగాయకులు స్వరపరచి సీడిగా వస్తే బాగుంటుంది.

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.