9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

రామానుగ్రహంతో 100కు చేరిన రామకీర్తనలు
రామకీర్తనలు అన్నీ ఈ పేజీలో చూడవచ్చును.


4 వ్యాఖ్యలు:

 1. శుభోదయం .

  ఈ రామానుగ్రహ కీర్తనలను , రామ శతకంగా ప్రచురిస్తే బాగుంటుందని నా అభిప్రాయం .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఏమో నండీ. రాముడి నిర్ణయం ఎలాగుందో. కొద్దిరోజుల క్రిందట, వేంకటేశశతకాన్ని శ్రీవారికి సమర్పిస్తానంటేనే తితిదే ప్రచురణలవిభాగాధిపతి అదేదో కూరగాయలన్నట్లుగా 'మీరు సరుకు పంపండి చూదాం', అన్నట్లుగా కొంచెం తేలికపరుస్తూ మాట్లాడారు. ఐనా పంపుదామనే అనుకుంటున్నా ననుకోండి. రామకీర్తనలైతే ఓపికున్నంతవరకూ వ్రాయటం‌ జరుగుతుంది. అన్నమయ్య సంకీర్తనల్నే రాగిచెంబుల కోసం కరిగించుకున్న ఘనత మనవాళ్ళది. పెద్దలపూనిక వలన కొన్నివేలు మాత్రం వెలుగుచూసాయి మొత్తం 32వేల దివ్యసంకీర్తనాల్లోనూ. ఈరామకీర్తనల సంగతి ఏమౌతుందో కాలమే చెప్పాలి. వవ్చినవి వచ్చినట్లుగా బ్లాగులో ప్రకటిస్తున్నాను. కాని వాటిని చదివే వారి సంఖ్య బహుస్వల్పమే. కొన్నికొన్ని అన్నమయ్య శృంగారసంకీర్తనలను వ్యాఖ్యానపూర్వకంగా వెలువరిస్తున్నాను కృష్ణాష్టమినుండి. ఆట్టేమందిని అవి చదివించటం లేదు. ఇక నా రామకీర్తనలను ప్రచురించినా చదివేవారుండరనే నా అనుమానం. నా ఆప్తమిత్రులు జొన్నలగడ్డ రామలింగేశ్వర శర్మ గారితో ఈ‌మధ్య మాట్లాడుతున్నప్పుడు ఈ‌రామకీర్తనలను ఒంటిమిట్టరాముడికి ఇస్తే బాగుంటుందనీ ఒక ఆలోచన చేసాము. అలాగే మరొక ప్రతిపాదనగా ఈ‌కీర్తనలను ప్రముఖగాయకులెవరైనా పాడితే బాగుంటుందని - అసలు ఇవి ఎవరిదృష్టికైనా రావటమూ వారికి నచ్చటమూ అన్నది జరిగినప్పటి మాటకదా - వారిదృష్టికి రాముడి సంకల్పం కారణంగా అవి వచ్చినప్పుడు కదా. చూదాం, అంతా రాముడు ఎలా ఆదేశిస్తే అలా జరుగుతుంది. నేను నిమిత్తమత్రుడిని మాత్రమే.

   తొలగించు
 2. రామభక్తి కీర్తన శతక కర్తగా మీకు శుభాభినందనలు!
  ~ లలిత

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ధన్యవాదాలండి. సాక్షాత్తూ లలితాపరాభట్టారికాదేవియే నన్ను అభినందించినట్లుగా భావిస్తాను.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.