3, ఫిబ్రవరి 2016, బుధవారం

శ్రీరామ ప్రియావృత్తం







           ప్రియ.
           నను నీ యశం
           బును రాఘవా
           కొని యాడనీ
           తనివారగన్




ప్రియ.

ఈ ప్రియావృత్తం ఒక ఇట్టిపొట్టి వృత్తం.  గణవిభజన స-వ. అంటే పాదానికి 5 అక్షరాలే అన్నమాట. అందుచేత యతిగొడవ లేదు. ప్రాసనియమం మాత్రం తప్పదు.

ఈ ప్రియావృత్తంలోని నాలుగు పాదాలనూ కలిపి ఒకే పాదంగా వ్రాస్తే అది గీతిక అనే వృత్తం అవుతుంది.  దానికి గణవిభజజన స-జ-జ-భ-ర-స-వ అవుతుంది. గీతిక పాదం నిడివి ఇరవై అక్షరాలు కదా, అందుకని యతినియమం వర్తిస్తుంది 13వ స్థానం వద్ద. ఈ గీతికను అప్పకవి ప్రభాకలిత వృత్తం అన్నాడు.

ఇలా చిట్టి పొట్టి పద్యాలు ముక్తకాలుగా బాగుంటాయి. కావ్య నిర్మితిలో కాదని బహుశః  పూర్వకవులు భావించేవారేమో. అందుచేత ఇలాంటివి కావ్యాల్లో అరుదుగా కనిపిస్తాయి.



1 వ్యాఖ్య:

  1. చిన్న వృత్తం బాగుంది, అడగగడం లో ఎలా తప్పించుకుందబ్బా!మరీ పొట్టి వృత్తాలంటే కష్టమే! స్రగ్ధర,మహా స్రగ్ధర వృత్తాలు చెప్పండి

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.