4, జనవరి 2016, సోమవారం

వసుధావృత్తంలో మనవి.


     వసుధ.
     నిను వేడుదునే
     కనవేల నయా
     జనకాత్మజనే
     వినువాడ వొకో
వసుధ.
ఈ వసుధా వృత్తానికి గణవిభజన స-స. అంటే పాదానికి ఆరు అక్షరాలు. ప్రాస అవసరం. యతిస్థానం అవసరం లేదు.
ఈ వసుధా వృత్తానికి  కిసలయ అనీ తిలక అనీ కూడా మరొక రెండు పేర్లు ఉన్నాయని తెలుస్తోంది.

సులభమైన పద్యం.

పాదం నిడివి తోటకం‌ పాదం‌ నిడివిలో సగం!  అవే స-గణాలు. కాబట్టి తోటకంలో వసుధావృత్తాన్ని ఇమిడ్చి వ్రాయవచ్చును, చిత్రకవిత్వంగా.


5 వ్యాఖ్యలు:

 1. ఒకటే పలుకై
  ఒకటే శరమై
  ఒకటే సతియై
  ఒక రాఘవుడే .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఛందం లో మీ పద్యాలు ఉదాహరణలుగా ఉంచడానికి అనుమతించండి. నా వద్ద మీ Email లేదు. మీకు వ్యక్తిగతముగా Email పంపగలను. (m.dileep@gmail.com)
  ఛందం: http://chandam.apphb.com/?chandam
  వసుధావృత్తం: http://chandam.apphb.com/?chandassu=vasudha

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. >ఛందం లో మీ పద్యాలు ఉదాహరణలుగా ఉంచడానికి అనుమతించండి
   దిలీప్ గారూ,

   తప్పకుండా మీరు ఛందం సైట్‌లో నా పద్యాలను ఉదాహరణలుగా స్వీకరించవచ్చును. నాకేమీ అభ్యంతరం లేదు. పదిమందికీ ఉపయోగించటం చాలా ఆనందించవలసిన సంగతే కదా.

   మీకు నేను ఇ-మెయిల్ పంపటమూ మనం సంభాషణలో ఉండటమూ ఇప్పటికే మొదలయ్యింది. అందుకు కూడా సంతోషంగా ఉంది.

   తొలగించు
 3. షడ్జామడ్జ ఖరాడ్జవీడ్జ వసుధాడ్జాలాంశ్చ మడ్గాఖరే....
  ఈ పద్యంనకు భావాన్ని
  karthik.nani645@gmail.com కు పంపగలరు..
  ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.