8, నవంబర్ 2015, ఆదివారం

కుశల వచనం.        చ.  కుశలము రామభక్తులను
              కొంచెము చేయని సజ్జనాళికిన్
        కుశలము రామునిం దెలియ
              గోరెడు వారికి చెప్పువారికిన్
        కుశలము రామనామమును
              కూర్మి భజించుచు నుండు వారికిన్
        కుశలము రామమార్గమున
              గొంకక ప్రీతి జరించు వారికిన్

     


1 వ్యాఖ్య:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.