6, నవంబర్ 2015, శుక్రవారం

రాముడికి నమస్కారం        ఉ. అతడిని రామచంద్రుడని
              యందురు కేవల ధర్మవిగ్రహుం
        డతడని విశ్వసింతురు
              మహాత్ము డనాది యనంతు డచ్యుతుం
        డతడని నమ్మియుందురు
              నిరామయు డీశ్వరు డార్తరక్షణా
        వ్రతు డత డందు రాతని
              కవశ్యము నేను నమస్కరించెదన్

     


1 వ్యాఖ్య:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.