5, నవంబర్ 2015, గురువారం

రాముని కొలచుట కర్తవ్యం      కం. కర్తగ నెవ్వని నెఱుగుదు
      భర్తగ నెవ్వాని నీవు భావించెదు సం
      హర్తగ నెవ్వని తెలియుదు
      కర్తవ్యము రాము నట్టి ఘనుని కొలువగన్
    
     


2 వ్యాఖ్యలు:

  1. ప్రత్యుత్తరాలు
    1. 'కర్తవ్యము రాము నట్టి ఘనుని కొలువగన్' అని చెప్పనే చెప్పాను కదండీ?
      అన్వయం చెప్పుకుంటే 'అట్టి ఘనుని రాముని కొలువగన్ కర్తవ్యము' అని సులభంగా బోధపడుతుంది.

      తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.