14, నవంబర్ 2015, శనివారం

సీతారాముల పెళ్ళికి జాతకాలు చూసారా?







      ఉ. రాముడు వింటి నెత్తె పెను
           రావముతో నది ముక్కలాయె నిం
      కేమని జానకీరఘుకులేశుల
           పెండ్లిని చేసినారయా
      భూమిపతుల్ మునీంద్రులును
           పొంతన లెంచరు జాతకంబులన్
      భూమిని మున్ను లేరు మరి
            పుట్టరుబో ఘను లట్టి దంపతుల్