12, నవంబర్ 2015, గురువారం

రాంబంటుకి ప్రశ్నలు      రాముని బంటువైతి వట
             రాముని కొల్వున జీత మెంతయా
      రాముని కేమి సేయుదువు
             రాముని సన్నిధి నీకు గల్గునా
      రాముని వంటి రాజు గల
             రాజ్యమె రాజ్య మటందురే సదా
      రాముని నీడలో బ్రతుకు
             ప్రాణివి నీ సుఖమెంత గొప్పదో
10 వ్యాఖ్యలు:

 1. (ఈ టపాకి సంబంధంలేని వ్యాఖ్య.)
  శ్యామలీయం గారూ, అయాచిత సలహా ఇస్తున్నానని అనుకోకండి / ఏమనుకోకండి. గతంలో కూడా ఓసారి మీకు మనవి చేశాను - "సిగరెట్లు మానెయ్యడం చాలా తేలిక, నేను చాలాసార్లు మానేసాను" :) - అనే జోక్ గురించి. బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయడం, మధ్యలో ఇంక మానేస్తున్నానని ప్రకటించడం, తర్వాత మళ్ళీ మొదలెట్టడం కూడా ఆ కోవలోనివే. వివిధ బ్లాగుల్లో మీ స్పందనలు / ప్రతిస్పందనలు చూస్తుంటే మీరింకా ఆ mode లోనే కొనసాగుతున్నట్లనిపిస్తోంది. mode మార్చండి Sir. ముఖ్యంగా ఇతర బ్లాగుల్లో సరిదిద్దుదామనే / వివరణలిద్దామనే ఆ temptation ని resist చెయ్యడానికి ప్రయత్నించి చూడరాదూ కొంతకాలం? మీకే కాస్త వ్యాకులత తగ్గుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నరసింహారావుగారూ, మీ మాట యదార్థం. ఏదో తెలుగుభాషపై నాకున్న మమకారం కొద్దీ సలహాలిస్తూ ఉంటాను. అది తప్పేనేమో ఈ కాలంలో. అలాగే ధార్మిక లేదా ఆధ్యాత్మికవిషయాలపై కూడా నాకు తెలిసినంతలో వ్రాస్తున్నాను కాని నేను పండితుడననో సర్వజ్ఞుడననో ఎన్నడూ అనలేదే ఎక్కడా! దాదాపు ఒకపథకం ప్రకారం అన్నంత నిక్కచ్చిగా నా మాటల్ని రకరకాలుగా కెలికి నామీద వ్యక్తిగతంగా విసుర్లు విసురుతున్నవారిని గమనిస్తే నిర్వేదం కలుగుతోంది. వ్యాకులత తగ్గించుకోవటం కోసం మీరన్నట్లు చేయాలి. యధాశక్తి ప్రయత్నిస్తాను. మీకు అనేక ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు

 3. రాముని కొలువున జీత మెంతయా ?

  రాముని కొలువున జీవితమే జీతం ! ఇక వేరు జీతమేల !

  చీర్స్
  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీకు చెప్పగలంతటివాడను కాదుకానీ, నాది కూడా విన్నకోట నరసింహారావు గారి మాటేనండీ
  ప్రఖ్యాక్షీణత ఫలమౌ
  వ్యాఖ్యానింపగ నటనిట వ్యాకులతయునున్
  ముఖ్యము కద శ్రీరాముని
  సఖ్యత శ్రీతాడిగడప శ్యామలరాయా!

  దర్పము గల తెలుగు వెలుగు
  లార్పెదమను తావులేల? యతులిత కృతులన్
  నేర్పుగ నిట హరి పద ప
  ద్మార్పితములు చేయుట సరి శ్యామలరాయా!

  భవదీయుడు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కొంచెం తటపటాయించిన పిదప వ్రాస్తునాను. మీరు ఆ బ్లాగులో నా అఖరి వ్యాఖ్యను గమనించారని భావిస్తున్నాను. ఆ బ్లాగులో ఉంచటం ద్వారా అస్థానపతితమైన నా వ్యాఖ్యలకు చింతిస్తున్నాను. అక్కడి దౌర్జన్యపూరితమైన వాతావరణం నాబోటి వారికి సరిపడదు. మీ సూచనకు ధన్యవాదాలు.

   తొలగించు
  2. ధన్యవాదములండీ.
   "అధిక విద్యావంతు లప్రయోజకులైరి.."
   అన్న పద్యము ఈనాడు ఎక్కడో చదువుతూ శేషప్పకవి ఎప్పుడో చెప్పినారే అనుకున్నాను

   తొలగించు
 5. ప్రత్యుత్తరాలు
  1. మీకే మేముచెప్పాలి ధన్యవాదములు విన్నకోట నరసింహారావు గారూ.

   తొలగించు
 6. మీ వ్యాఖ్యలు గమనించాను.
  ఆవేదనపొందాను,అవాక్కయ్యాను. ఉబోస నాకిష్టం లేదు, గతజల సేతు బంధనం వ్యర్ధం.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.