12, ఆగస్టు 2015, బుధవారం

తానెవరో తా నెఱుగదయా








నీ నామమకరందపానవిలోల మైనాచిత్తము మైమరచి
తానెవరో తా నెఱుగదయా తానున్న గదా తన్నెఱుగ



తనలో నీ వుండ తాను నీలో నుండ
తనకు నీకును బేధమనునది లేకుండ
ఘనమైన యీ సృష్టి కరిగిపోవుచు నుండ
తనకేమి యునికి తనకేడ యునికి తనకేల యునికి
నీ నామ

మనసున ప్రకృతిమాయ జొచ్చిన వేళ
గుణముల నెన్ని తాను తనువున జొచ్చు
తనను నీమ్రోల నుంచుకొని మురిసిన వేళ
గుణముల కేయునికి తనువున కేయునికి తనకేమి యునికి
నీ నామ

మనసు శ్రీరామతత్త్వ మందు లీనమైనది
మనోలయము తారకమంత్రముచే గలిగినది
మనసులేక లేదు జననమరణచక్ర మన్నది
యునికి యనగ పరబ్రహ్మమునకు మాత్రమున్నది
నీ నామ