భగవంతుని మీరు తగిలి యుండేరో తగని తలపుల తోడ తల్లడిల్లేరో |
||
రాముని మరచి మీరు కాముని దాసులై భూమికి బరువులనగ పొరలుచుండేరో కామితార్థములు కాంతాకనకంబు లనువారు వేమరు పుట్టి చచ్చి యేమి సాధించేరు |
||
ఏల వీరి వారి వద్ద కాలము గడిపేరు మేలైన గురువెవ్వడు మీకు రాముని కన్న చాలింతురో వెఱ్ఱి సాకులు మీఱింక బేలలై తప్పుడు త్రోవల పాలయ్యేరో |
||
ఇతరుల మాటలెన్ని యిడుములు కుడుచేరో పతియుగతియు రాముడన్న హితమెంచేరో మతిలేని వాదాలు మానక చేసేరో మతిమంతులై రామమార్గ మెన్నేరో |
||