3, మే 2015, ఆదివారం

ఈవేళ తేలిపోవాలి రావయ్య ఓ అందగాడానీవాడ నైతినో నేను
నావాడ వైతివో నీవు
ఈవేళ తేలిపోవాలి
రావయ్య ఓ అందగాడా

బెలిపించి భూమికి పంపింది ఎవరు
వలపించి కలలన్ని పండించి రెవరు
తలపులన్నిట నిండి తబ్బిబ్బు చేసిన
తులలేని స్నేహసద్గుణరాశి ఎవరు
॥నీవాడ॥
నేనన్న భావన నీవు చేసిన మాయ
ఆనాటి నుండి నే నీనాటి వరకు
నీ నాటకంబునే నీ తృప్తి కొఱకు
పూని యాడుచు నుంటి భూలోకమందు
॥నీవాడ॥
నీ వాడనే యని నీవు ఆడించితే
నా వాడవే యని నమ్మి యాడేను
ఏ వార లెవరి వా రెవరు తేల్చేది
రావయ్య మాయపొర లావల పెట్టి
॥నీవాడ॥2 వ్యాఖ్యలు:

 1. ...\ఈవేళ తేలిపోవాలి
  రావయ్య ఓ అందగాడా ...

  వామ్మో వామ్మో ఇంత 'బరి' తెగింపా !!

  బరి దాటితే కాని ఆ అందగాడు 'కనులారడేమో' !

  చీర్స్
  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. >> నీ వాడనే యని నీవు ఆడించితే, నా వాడవే యని నమ్మి యాడేను
  LOL. Excellent

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.