16, ఏప్రిల్ 2015, గురువారం

కనుల జూద మనుకొందును కనులు చాల వనుకొందునుకనుల జూద మనుకొందును
కనులు చాల వనుకొందును
మనసు పట్టలేని నిన్ను
కనులు పట్ట లేవందును

భావనలో పట్టరాని
పావన మగు భవ్యమూర్తి
ఆ విధమని ఈ విధమని
నీ వైభవ మెన్ని నేను
॥కనుల॥
ఓహోహో‌ నీవే నా
ఊహల నడపించు శక్తి
ఊహింపగరాని నిన్ను
ఊహించును భక్తి  కాన
॥కనుల॥
ఏమో పరమేశుడవో
రాముడవో కృష్ణుడవో
నా మనసున నిలచితివే
నీ మూర్తిని మనసారా
॥కనుల॥వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.