30, ఏప్రిల్ 2015, గురువారం

సత్యనారాయణ సత్యనారాయణ


సత్యనారాయణ సత్యనారాయణ
నిత్యనిర్మలకీర్తీ సత్యనారాయణ


శ్రీరత్నగిరిసంస్థితనారాయణ
కారణకారణ కరుణాభరణ
శ్రీరమణీమణీహృదయవిహరణ
నారదసన్నుత నాగశయాన
సత్య

నీరజాక్ష  కలినిర్మూలనచణ
వీరవేంకట సత్యనారాయణ భవ
తారణకారణ నారాయణ భక్త
పారిజాత సత్యనారాయణ
సత్య

వరద  అనంతలక్ష్మీ  భావిత చరణ
నిరుపమ అన్నవరపురవర విహరణ
సురవైరిశోషణ సురగణతోషణ
హరిహరబ్రహ్మరూప ఆదినారాయణ
సత్య[ ఈ రోజున కొద్ది సేపటి క్రితం మా తమ్ముడు చిరంజీవి తాడిగడప సత్యశ్రీరామచంద్రమూర్తి శ్రీసత్యనారాయణస్వామివారిమీద కొన్ని కీర్తవలు రచించవలసిందిగా కోరటం జరిగింది. అది నాకూ ఎంతో ఆనందదాయకమైన విషయం కాబట్టి స్వామివారిపైన యథాశక్తిగా కొంత సాహిత్యం అయన అనుగ్రహం మేరకు వెలువరించాలని ఆశిస్తూ ఈ కీర్తనతో ప్రారంభిస్తున్నాను. స్వామివారు ఏమేమి ఈ అల్పప్రతిభుడిచేత వ్రాయిస్తారో అని నేనూ అసక్తిగా ఎదురుచూస్తున్నాను.]

1 వ్యాఖ్య:

  1. చాలా బాగుంది.....ఇలాగే స్వామి వారి మీద మరిన్ని కీర్తనలు, సుప్రభాతం వ్రాయగలవని ఆశిస్తున్నాను ...

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.