24, మార్చి 2015, మంగళవారం

మీ రేల యెఱుగరో నారాయణునిమీ రేల యెఱుగరో నారాయణుని
శ్రీరాముడై చాల చేరువైన వాని

పాలసంద్రములోన పవ్వళించెడు వాని
లీలగా బ్రహ్మాండ మేలుచుండు వాని
ఫాలాక్షబ్రహ్మేంద్రభావితుడగు నట్టివాని
నేలపై ధర్మంబు నిలుపబుట్టిన వాని                 ॥మీరేల॥

సకలపాపాటవులను చక్కగ దహియించు వాని
సకలశోకముల నుండి క్షణమున రక్షించు వాని
సకలదోషాచరచమూమథను డగు వాని
సకలభక్తకోటిహృదయసరోజస్థు డైన వాని          ॥మీరేల॥

భక్తమందారుడనే ప్రఖ్యాతిగలవాని
వ్యక్తపరబ్రహ్మమై భద్రాద్రి నున్న వాని
శక్తికొలది సేవించి సంతసించదగువాని
ముక్తినిచ్చు సద్గుణము ముఖ్యముగ గలవాని     ॥మీరేల॥


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.