5, జనవరి 2015, సోమవారం

వంద వసంతాలూ - ఒక గ్రీష్మమూశతవసంతాలనీ ఒక క్షణంగా గడిపేసాను
అప్పుడొచ్చింది యుగాంతపర్యంతగ్రీష్మం
ఈ క్రూరత్వం ప్రకృతిసహజం అనుకోనా

నిర్వాజపరోపకారసుకృతి వంటారే నిన్ను
ఈ గ్రీష్మాతపాన్నుండి కాపాడేదెవరయ్యా
కనీసం నువ్వైనా పూనుకోకపోతే నాకోసం

వేదాంతం‌ ప్రకారం ప్రకృతిపై నీదే పెత్తనం
నాకర్మం‌ ప్రకారం ప్రకృతిదే పూర్తి పెత్తనం
ఇప్పుడేం చేయాలో పాలుపోకుందే మరి

నీకోసం ప్రకృతిని కొలవటం మానేసాను
అందుకే ఇప్పుడది పగతీర్చుకుంటోంది
నువ్వా యోగనిద్ర నుండి లేస్తావా లేదా

ఇంతకన్నా ఇంకెలా చెప్పాలో తెలియదు
ఎంతచెప్పినా నీకు వినిపించటమే లేదు
నువ్వూడిపడేలోగా నేను పడేలాగున్నాను


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.