24, నవంబర్ 2014, సోమవారం

వివేచన - 33. సర్వవిధముల నా కతిసన్నిహితుడు


ఈ చరాచర సృష్టి నెనుబది నాలుగు
లక్షల జీవాళి లక్షణముల

నెఱుగుచు వాటికి నెల్లవేళల నుత్త
మంబగు గతులను మలుచు వాడు

వాటికి గలుగు నుపాధిగతంబగు
చిక్కులు దీర్చుచు నక్కజముగ

నక్షీణకృపను సంరక్షణం బొనరించ
క్షణ మేని విశ్రాంతి గొనని వాడు

జీవులాడెడు నాటల చిత్రగతులు
మందహాసంబుతో జూచు మంచివాడు
సర్వవిధముల నా కతిసన్నిహితుడు
వాని నీశ్వరు నిత్యంబు బ్రస్తుతింతువ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.