17, నవంబర్ 2014, సోమవారం

వివేచన - 29. ఎఱుక గల్గిన యీక్షణ మేను నీది


ఇపుడు చక్కగ నున్న యింద్రియంబుల సత్త్వ
మెన్నాళ్ళు నిలచునో యెవరి కెఱుక

తనదంచు మురిపాన దాల్చి తిరుగెడు దేహ
మెన్నాళ్ళు నిలచునో యెవరి కెఱుక

లోకంబు తనకిచ్చు నీ కొద్ది మరియాద
యెన్నాళ్ళు నిలుచునో యెవరి కెఱుక

ఈశ్వరార్పితమైన యీ బుధ్ధి చక్కగా
యెన్నాళ్ళు నిలుచునో యెవరి కెఱుక

నీది నీదన నిజముగా నేది యుండె
నెఱుక గల్గిన యీక్షణ మేను నీది
యిదియె పదిలంబుగా బట్టి యీశ్వరునకు
పాదపూజల వెచ్చించ వలయునయ్య3 వ్యాఖ్యలు:

 1. ... ఎఱుక గల్గిన యీక్షణ మేను నీది ...
  సత్యవాక్కు ...
  __/\__ ...

  ప్రత్యుత్తరంతొలగించు

 2. >> నెఱుక గల్గిన యీక్షణ మేను నీది!!

  ఆ ఈ క్షణమును ఇచ్చిన వాడెవ్వాడు ??

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.