17, నవంబర్ 2014, సోమవారం

వివేఛన - 27. నీ దివ్యవిభవంబు మఱువకుండసుకవు లద్భుతమైన స్తోత్రంబులం జేసి
సేవించి ధన్యులై చెలగు చుండ

పరమమౌ ప్రేమచే పరవశమై భక్త
కోటి నిన్నెప్పుడు కొలుచు చుండ

నీ దైన తత్త్వంబు నిత్యంబు భావించి
ముదమున యోగీంద్రముఖ్యు లుండ

నీ దయ చాలని నిరతంబు పామరుల్
ప్రార్థించు వారలై పరగు చుండ

అందరకు నీదు సత్కృప యలరు చుండ
జీవులందరు తుది నిన్ను చేరు చుండ
నెఱపు  నీ దివ్యవిభవంబు మఱువ కుండ
నుండ జేయవె యీశ్వరా యుర్విమీదవ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.