15, నవంబర్ 2014, శనివారం

వివేచన - 25. ప్రేమమీఱ పిలుచుకొందునుపిలచెదనో నిన్ను ప్రియసఖుండ వటంచు
తలచి నిత్యంబు సంతస మెసంగ

పిలచెదనో నిన్ను విశ్వపతి వటంచు
వినయంబు భయమును పెనగుచుండ

పిలచెదనో నిన్ను విశ్వాత్ముడ వటంచు
నాత్మలో సద్భక్తి యతిశయింప

పిలచెదనో నిన్ను వేదవేద్యుడవంచు
అరిది వివేకోదయంబు నిగుడ

పిలుపుపులుపున నాదైన ప్రేమమీఱ
పిలుచుకొందును నీవు నా తలపులందు
నిలచియుండిన చాలు నే‌ యలుపుసొలుపు
కలుగ నేర్చునె సుంతయు కలనుగూడ1 వ్యాఖ్య:


  1. పిలుపు పులుపు న నాదైన ప్రేమమీఱ ???

    బాగుందండీ !

    ప్చ్ !ఇంత పిలచినా కానరాడే మరి !!

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.