14, నవంబర్ 2014, శుక్రవారం

వివేచన - 23. గడుసుతనం.ఆగమోక్తంబుగ నర్చించజాలను
విధివిధానంబు లవిదిత మగుట

స్త్రోత్రపాఠంబుల జోలికి పోలేను
కంఠగతంబులు కావు గనుక

ఏ మంత్రజప మేని యెంచి చేయగలేను
బుధ్ధి కుదురుగ నుండ బోదు కనుక

ఉపవాసదీక్షల నుండగ జాలను
ఆరోగ్య మంతంత యగుట వలన

ఇంక నేనేమి జేయుదు నిట్టివాని
నేలమన్నింతు వీ వని యెంచి వగచి
వంత వీడితి నీవు నిర్వ్యాజకరుణ
బ్రోచువాడవు సుమ్మని తోచి నంతవ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.