14, నవంబర్ 2014, శుక్రవారం

వివేచన - 22. ఎన్నెన్నో‌ లెక్కలుకాలంబు లెక్కించు కర్మశేషంబును
సుఖదుఃఖముల లెక్క జూచు జీవి

తప్పొప్పులను దండధరుడు లెక్కించును
ధనధాన్యముల లెక్క దలచు జగతి

ఆర్జన లెక్కింతు రాలును బిడ్డలు
మంచిని సఖులె లెక్కించగలరు

దేవుడు లెక్కించు జీవుని పరిణతి
అధిపులు లెక్కింతు రతని పనులు

లెక్కలెక్కకు నెన్నెన్ని చిక్కులకట
ఇన్ని లెక్కలు సరిబోలు చున్న గాని
జీవి సంసారయాత్రను చేసి తుదకు
శాంతిజెందుట యన్నది జరుగకుండు1 వ్యాఖ్య:


  1. బాగు బాగు !!

    కామెంటిన ఘల్లు ఘల్లు న మరిన్ని పద్యములు దక్కున్ !!

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.