11, నవంబర్ 2014, మంగళవారం

వివేచన - 19. నన్ను తలచువారు నా కెవ్వరును లేరు


నన్ను తలచువారు నా కెవ్వరును లేరు
నా వెన్క నొక పది నాళ్ళ వెనుక

ఊరక తలచగా నుపకార మొకరికి
చేయ నైతి గనుక జీవితమున

చేసిన పనులెల్ల చిత్తశుధ్ధిగ నేను
చేసితి కర్తవ్యచింత గలిగి

ఒకరి గొప్పసేయ నొకరి మెప్పింపను
వర్తించినది లేదు వాస్తవముగ

నెవరు తలచు వార లిట్టివానిని నన్ను
నీవె గాక నిజము నీరజాక్ష
నేను నిన్ను తలతు నీవు నన్నెన్నెదు
వెవరు తలచకున్న నేమి నాకు


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.