10, నవంబర్ 2014, సోమవారం

వివేచన - 18. ఆదుకొనవయ్య దేవుడా


నడిపించెదవు జగన్నాటకమును నీవు
జగమెల్ల నెఱుగు నా సంగతియును

నిన్ను తలచు వారు నేడేని రేపేని
కొల్లలై యుందురు కువలయమున

నడచుచుంటిని జగన్నాటకమున నేను
జగమెల్ల నెఱుగు నా సంగతియును

నన్ను తలచు వార లన్న నేడెందరో
యొకరు రేపు దలప నుర్వి మీద

కాన నీ వేడ నే నేడ ఘనుడ యింక
శోధనలు మాని యికనైన బాధతీర్చి
యాదుకొనవయ్య దేవుడా యనవరతము
చచ్చుచుండుట పుట్టుట చాలు నింక


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.