10, నవంబర్ 2014, సోమవారం

వివేచన - 17. నీవు నా వాడవై నేను నీ వాడనై


నేను పిలచిన నాడు నీవు పలుకుచు నుంటి
వంత కన్నను కోరు నదియు లేదు

నీవు పిలచిన నాడు నేను వచ్చుచు నుంటి
జాగుచేయక నొక్క క్షణము కూడ

మన మధ్య స్నేహంబు మన కిర్వురకు కూడ
పాయని బంధమై వరలు చుండ

నీవు నా వాడవై నేను నీ వాడనై
జగముల యుగములే జరుగనిమ్ము

మాయ నన్నేమి చేయను మరల నదియు
నరయ నీదైన లీలయే‌ నగును గాన
కాల మది యేమి చేయు నా కాల మైన
నీ స్వరూపవిశేషమే నిశ్చయముగ


2 వ్యాఖ్యలు:


 1. నీవు నా వాడవై నేను నీ వాడనై
  జగముల యుగములే జరుగనిమ్ము

  ఇన్ని యుగములు గడిచినా నీవు నీవే నేను నేనే !
  ఎందులకీ నీ నా 'మిత్ర భేదము " దేవా !!

  చీర్స్
  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.